Sai Pallavi : బుర్ఖాలో థియేట‌ర్‌లో అడుగుపెట్టిన సాయి ప‌ల్ల‌వి.. సినిమా చూసి ఫుల్ ఖుష్‌..

December 30, 2021 9:35 AM

Sai Pallavi : మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తోంది. తన నటనతో, తన డ్యాన్స్ తో ప్రేక్షకులని మెప్పిస్తూ అభిమానుల్ని సంపాదించుకుంటోంది. సాయి పల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. ఇప్పుడు తమిళ్, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది సాయి పల్లవి.

Sai Pallavi watched her movie in a theatre

ఇటీవలే నాని సరసన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంతో మన ముందుకి వచ్చి విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి చేసిన పాత్రకి మంచి పేరు వస్తోంది. అయితే ఈ సినిమా దక్షిణాదిన అన్ని భాషల్లో రిలీజ్ అయింది. ఇప్పటికే మలయాళం, తెలుగు, తమిళ్ సినిమాలలో నటిస్తున్న సాయి పల్లవి ఈ సినిమాతో కన్నడలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా సాయి ప‌ల్ల‌వి హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేట‌ర్‌కి వెళ్లింది.

బుర్ఖాలో వెళ్లిన సాయి ప‌ల్ల‌విని ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌లేదు. దీంతో ప్ర‌శాంతంగా సినిమా మొత్తం వీక్షించింది. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత బుర్ఖా ఓపెన్ చేసి త‌న ఫేస్ చూపించి ఆ త‌ర్వాత కారు ఎక్కి వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. త్వ‌ర‌లో సాయి ప‌ల్ల‌వి బాలీవుడ్‌లోనూ స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now