రూ.50 కోట్ల‌ను పోగొట్టుకున్న సాయిప‌ల్ల‌వి.. ఎందుక‌లా..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ గా పరిచయం అవుతుంటారు. కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకోవడం కోసం ఎక్స్‌పోజింగ్  చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అటు సినిమాలలోనూ, ఇటు యాడ్స్ లోనూ నటిస్తూ కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుంటున్నారు. కానీ వీటన్నింటికి భిన్నంగా చిత్రంలో చేసే క్యారెక్టర్ కు మాత్రమే ప్రత్యేకత గుర్తింపు ఉండాలని భావిస్తూ ముందుకు దూసుకుపోతోంది లేడీస్ పవర్ స్టార్ సాయి పల్లవి.

ఫిదా చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అభినయంతోనే అనేకమంది అభిమానులను సంపాదించుకున్న ఒకే ఒక హీరోయిన్ సాయి పల్లవి. తను చేసే చిత్రాలలో పాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకునే హీరోయిన్ సాయి పల్లవి. తనకంటూ ఒక బౌండరీ గీసుకొని, ఎంత డబ్బు ఎర చూపినా కూడా తల వంచకుండా ఆమె అనుకున్న పని చేసే తీరుతుంది. పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినా కూడా తనకు కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా నిరాకరిస్తుంది.

ఎంత మంచి కథ, బడా నిర్మాణ సంస్థ అయినా కూడా గ్లామ‌ర్ షోకి నో చెబుతూ నిర్మొహమాటంగా ఎన్నో అవకాశాలను వదిలేసింది. సాయి పల్లవి తరహా చూస్తే ఖచ్చితంగా ఈ కాలం ఉండాల్సిన‌ అమ్మాయి అయితే కాదు. ఇప్పటి తరం హీరోయిన్స్ తో పోలిస్తే ఆ స్పీడ్, వాళ్ల స్టైల్ సాయి పల్లవిలో లేవనే చెప్పవచ్చు. ఈమె పద్ధతులు, ఆచరణలు అంజలీదేవి, రాజసులోచన కాలంనాటి తారల‌ను గుర్తుకు తెస్తాయి. ప్రస్తుతం విరాటపర్వం, గార్గి వంటి చిత్రాలతో వరుస పరాజయాలను తన ఖాతాలో వేసుకుంది.

చిరంజీవి లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చినా కూడా నో చెప్పి ఎక్కడ కూడా ఏమాత్రం భయం లేకుండా తన పని తను చేసుకుపోతోంది. సాయి పల్లవి ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా తనకంటూ రూ.10 లక్షలు కూడా ఖర్చు పెట్టుకోలేదు. అంతేకాకుండా ఆమె సిద్ధాంతాల ద్వారా కేవలం దర్శకుడు చెప్పినట్లు నటించాలనే రూల్స్ ను బ్రేక్ చేసింది సాయిపల్లవి. వచ్చిన అవకాశాలని వదులుకుంటూ దాదాపు రూ.50 కోట్ల వరకు నష్టపోయిందని సినిమా వర్గాలలో టాక్ వినిపిస్తోంది. వచ్చిన మంచి మంచి అవకాశాలను చేజార్చుకుంటూ ఆమె కెరీర్ ని ప్రశ్నార్థకం చేసుకుంటుంద‌ని.. వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రి ముందు ముందు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM