Sai Pallavi : సౌత్ సినీ ఇండస్ట్రీలో సాయిపల్లవి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలు చేయకపోయినా సరే ఆమె తన నటన, డ్యాన్స్ నే నమ్ముకుంది. అందుకనే అభిమానులు ఆమెను పెద్ద ఎత్తున ఆదరిస్తుంటారు. ఇక సాయిపల్లవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.
సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ హిట్ కావడంతో ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే సాయిపల్లవికి చెందిన ఓ విషయం గురించి తెలుసుకుంటే.. మీరు హ్యాట్సాఫ్ అంటారు.. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
సాయిపల్లవి ఎలాంటి యాడ్స్‌లో కనిపించదు, ఏ మాల్స్ ఓపెనింగ్‌కు వెళ్లదు. ఆమెకు అలాంటివి నచ్చవు. అయితే ఓ ప్రముఖ ఫెయిర్‌నెస్ క్రీమ్ కంపెనీ వారు తమ కంపెనీ యాడ్‌లో నటించాలని, అందుకు రూ.2 కోట్ల వరకు ఇస్తామని ఆమెను కలిశారు. కానీ ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. ఎందుకంటే..
మనది భారతదేశం. మన కలర్ పట్ల మనకు గౌరవం ఉండాలి. అమెరికన్లు తెల్లగా ఉంటారు. ఆఫ్రికన్స్ నల్లగా ఉంటారు. మనిషి ఏ కలర్‌లో ఉన్నా.. వారి మనస్సు మంచిదై ఉండాలి. అప్పుడే ఎవరినైనా గౌరవిస్తారు. ఇలాంటి యాడ్స్‌లో నటించి సమాజానికి చెడు మెసేజ్‌ను ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. అలా వచ్చే డబ్బును నేనేం చేయాలి ? పూటకు నాకు ఒక చపాతి, ఇంత అన్నం చాలు. నాకు వీలైనంత వరకు నా చుట్టూ ఉండే వారికి సహాయం చేస్తా.. అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. అందుకనే ఆమెను గ్రేట్ అంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…