Sai Pallavi : హ్యాట్సాఫ్ సాయిప‌ల్ల‌వి.. ఆమెను గ్రేట్ అనేది అందుకే..!

October 5, 2021 10:12 AM

Sai Pallavi : సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో సాయిప‌ల్ల‌వి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌క‌పోయినా స‌రే ఆమె త‌న న‌ట‌న‌, డ్యాన్స్ నే న‌మ్ముకుంది. అందుక‌నే అభిమానులు ఆమెను పెద్ద ఎత్తున ఆద‌రిస్తుంటారు. ఇక సాయిప‌ల్ల‌వి ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది.

Sai Pallavi : హ్యాట్సాఫ్ సాయిప‌ల్ల‌వి.. ఆమెను గ్రేట్ అనేది అందుకే..!

సాయి ప‌ల్ల‌వి న‌టించిన ల‌వ్ స్టోరీ హిట్ కావ‌డంతో ఆమె ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తోంది. అయితే సాయిపల్ల‌వికి చెందిన ఓ విష‌యం గురించి తెలుసుకుంటే.. మీరు హ్యాట్సాఫ్ అంటారు.. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

సాయిప‌ల్ల‌వి ఎలాంటి యాడ్స్‌లో కనిపించ‌దు, ఏ మాల్స్ ఓపెనింగ్‌కు వెళ్ల‌దు. ఆమెకు అలాంటివి న‌చ్చ‌వు. అయితే ఓ ప్ర‌ముఖ ఫెయిర్‌నెస్ క్రీమ్ కంపెనీ వారు త‌మ కంపెనీ యాడ్‌లో న‌టించాల‌ని, అందుకు రూ.2 కోట్ల వ‌ర‌కు ఇస్తామ‌ని ఆమెను క‌లిశారు. కానీ ఆమె ఆ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించింది. ఎందుకంటే..

మ‌న‌ది భార‌త‌దేశం. మ‌న క‌ల‌ర్ ప‌ట్ల మ‌నకు గౌర‌వం ఉండాలి. అమెరిక‌న్లు తెల్ల‌గా ఉంటారు. ఆఫ్రిక‌న్స్ న‌ల్ల‌గా ఉంటారు. మ‌నిషి ఏ క‌ల‌ర్‌లో ఉన్నా.. వారి మ‌న‌స్సు మంచిదై ఉండాలి. అప్పుడే ఎవ‌రినైనా గౌర‌విస్తారు. ఇలాంటి యాడ్స్‌లో న‌టించి స‌మాజానికి చెడు మెసేజ్‌ను ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. అలా వ‌చ్చే డ‌బ్బును నేనేం చేయాలి ? పూట‌కు నాకు ఒక చ‌పాతి, ఇంత అన్నం చాలు. నాకు వీలైనంత వ‌ర‌కు నా చుట్టూ ఉండే వారికి స‌హాయం చేస్తా.. అని సాయిప‌ల్ల‌వి చెప్పుకొచ్చింది. అందుక‌నే ఆమెను గ్రేట్ అంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now