Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు గతేడాది హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై యాక్సిడెంట్ అయిన విషయం విదితమే. యాక్సిడెంట్‌లో భాగంగా తేజ్‌కు కాలర్ బోన్ విరిగింది. దీంతో సుదీర్ఘకాలం పాటు హాస్పిటల్‌లో ఉండి చికిత్స తీసుకున్నాడు. తరువాత ఒకటి రెండు సార్లు మెగా ఫ్యామిలీ వేడుకల్లో కనిపించాడు. అయితే ఈ మధ్య సాయిధరమ్ తేజ్ అసలు బయట కనిపించడం లేదు. దీంతో ఆయనకు ఏమైందోనని ఫ్యాన్స్ మళ్లీ ఆందోళన చెందుతున్నారు.
సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్నట్లు ఆయన ట్వీట్లను చూస్తే అర్థమవుతుంది. అయితే అవి ఆయన వ్యక్తిగత విషయాలకు చెందిన ట్వీట్లు కావు. ఇతర సినిమాలకు చెందిన చిత్ర యూనిట్‌లు, హీరోలకు ఆయన శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్లు. ఆయన తన ఫొటోలను మాత్రం పెట్టడం లేదు. దీంతో ఆయనకు మళ్లీ ఏమైనా అయిందా.. అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కాగా సాయి ధరమ్ తేజ్ త్వరలో ఓ తమిళ రీమేక్ మూవీలో నటించనున్నట్లు తెలిసింది. అందులో పవన్ కల్యాణ్ కూడా నటిస్తారని సమాచారం. ఆ మూవీలో పవన్‌ది గెస్ట్ రోల్ మాత్రమేనని తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారికంగా వివరాలను ప్రకటిస్తారని సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…