Sai Dharam Tej : సాయిధ‌ర‌మ్ తేజ్ గురించి ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్‌..!

February 12, 2022 9:25 PM

Sai Dharam Tej : మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ కు గ‌తేడాది హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై యాక్సిడెంట్ అయిన విష‌యం విదిత‌మే. యాక్సిడెంట్‌లో భాగంగా తేజ్‌కు కాల‌ర్ బోన్ విరిగింది. దీంతో సుదీర్ఘ‌కాలం పాటు హాస్పిట‌ల్‌లో ఉండి చికిత్స తీసుకున్నాడు. త‌రువాత ఒక‌టి రెండు సార్లు మెగా ఫ్యామిలీ వేడుక‌ల్లో క‌నిపించాడు. అయితే ఈ మ‌ధ్య సాయిధ‌ర‌మ్ తేజ్ అస‌లు బ‌య‌ట కనిపించ‌డం లేదు. దీంతో ఆయ‌న‌కు ఏమైందోన‌ని ఫ్యాన్స్ మళ్లీ ఆందోళన చెందుతున్నారు.

Sai Dharam Tej fans are worrying about him
Sai Dharam Tej

సాయి ధ‌ర‌మ్ తేజ్ ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉన్న‌ట్లు ఆయ‌న ట్వీట్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. అయితే అవి ఆయ‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు చెందిన ట్వీట్లు కావు. ఇత‌ర సినిమాల‌కు చెందిన చిత్ర యూనిట్‌లు, హీరోల‌కు ఆయ‌న శుభాకాంక్ష‌లు చెబుతూ చేసిన ట్వీట్లు. ఆయ‌న త‌న ఫొటోల‌ను మాత్రం పెట్ట‌డం లేదు. దీంతో ఆయ‌న‌కు మ‌ళ్లీ ఏమైనా అయిందా.. అంటూ ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాగా సాయి ధ‌ర‌మ్ తేజ్ త్వ‌ర‌లో ఓ త‌మిళ రీమేక్ మూవీలో న‌టించ‌నున్న‌ట్లు తెలిసింది. అందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా న‌టిస్తార‌ని స‌మాచారం. ఆ మూవీలో ప‌వ‌న్‌ది గెస్ట్ రోల్ మాత్ర‌మేన‌ని తెలిసింది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారికంగా వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now