Sada : సదా.. ఈ అమ్మడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి సదా.. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైంది.. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో నటించి సూపర్ పాపులర్ అయ్యింది. సదా సిల్వర్ స్క్రీన్ కి దూరమై చాలా రోజులవుతుంది . ఆమె చివరి చిత్రం 2018లో విడుదలైంది. తెలుగులో 2014 తర్వాత కనిపించలేదు. ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ కి కూడా సిద్ధమైంది. హీరో, హీరోయిన్స్ కి వదిన, అక్క పాత్రలు చేసేందుకు సిద్ధం అంటున్నారు.
అదే సమయంలో సదా బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. సదా డాన్స్ రియాలిటీ షో జడ్జిగా మరారు. మరోవైపు సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రకారు మనసులు కొల్లగొడుతూనే ఉంది. అయితే ఇన్నాళ్లు సోలోగా ఉన్న ఈ అమ్మడు త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైందని అంటున్నారు. చాలా తక్కువ సమయంలోనే కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిన సదా.. తెలుగుతో పాటు తమిళంలో కూడా అగ్ర హీరోలతో కలిసి సినిమాలు చేసింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన మనసుకు నచ్చిన వాడు దొరికితే కచ్చితంగా పెండ్లి చేసుకుంటానని చెప్పింది.
అయితే అత్యంత విశ్వసనీ వర్గాల సమాచారం ప్రకారం.. సదా త్వరలోనే పెండ్లి చేసుకోబోతోంది. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. వీరిద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారంట. కానీ పెండ్లి విషయం కన్ఫర్మ్ అయ్యాక అఫీషియల్ గా చెప్పాలని సదా వెయిట్ చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి జోరుగా ప్రచారాలు నడుస్తుండగా, త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ అయితే రానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…