Sada : ఎట్ట‌కేల‌కు స‌దా మంచి సౌండ్ పార్టీనే ప‌ట్టిందిగా..? త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్ చెప్ప‌బోతుంది..?

January 30, 2023 10:27 PM

Sada : సదా.. ఈ అమ్మ‌డి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి స‌దా.. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైంది.. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో నటించి సూపర్ పాపులర్ అయ్యింది. సదా సిల్వర్ స్క్రీన్ కి దూరమై చాలా రోజులవుతుంది . ఆమె చివరి చిత్రం 2018లో విడుదలైంది. తెలుగులో 2014 తర్వాత కనిపించలేదు. ఈ అమ్మ‌డు సెకండ్ ఇన్నింగ్స్ కి కూడా సిద్ధ‌మైంది. హీరో, హీరోయిన్స్ కి వదిన, అక్క పాత్రలు చేసేందుకు సిద్ధం అంటున్నారు.

అదే స‌మ‌యంలో స‌దా బుల్లితెర‌పై కూడా సంద‌డి చేస్తుంది. సదా డాన్స్ రియాలిటీ షో జడ్జిగా మరారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌న‌సులు కొల్ల‌గొడుతూనే ఉంది. అయితే ఇన్నాళ్లు సోలోగా ఉన్న ఈ అమ్మడు త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్కేందుకు సిద్ధ‌మైంద‌ని అంటున్నారు. చాలా తక్కువ సమయంలోనే కుర్రాళ్లకు ఫేవరెట్‌ హీరోయిన్ గా మారిన స‌దా.. తెలుగుతో పాటు తమిళంలో కూడా అగ్ర హీరోలతో కలిసి సినిమాలు చేసింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన మనసుకు నచ్చిన వాడు దొరికితే కచ్చితంగా పెండ్లి చేసుకుంటానని చెప్పింది.

Sada reportedly getting married
Sada

అయితే అత్యంత విశ్వసనీ వర్గాల సమాచారం ప్రకారం.. సదా త్వరలోనే పెండ్లి చేసుకోబోతోంది. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీ వర్గాల నుండి స‌మాచారం అందుతుంది. వీరిద్దరూ గత కొంత కాలంగా డేటింగ్‌ లో ఉన్నారంట. కానీ పెండ్లి విషయం కన్ఫర్మ్‌ అయ్యాక అఫీషియల్‌ గా చెప్పాలని సదా వెయిట్ చేస్తుంద‌నే టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతానికి అయితే దీనికి సంబంధించి జోరుగా ప్ర‌చారాలు న‌డుస్తుండ‌గా, త్వ‌ర‌లోనే దీనిపై పూర్తి క్లారిటీ అయితే రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment