Giving Money : ప్రపంచం మొత్తాన్ని ప్రస్తుతం నడిపిస్తున్న వాటిల్లో డబ్బు ప్రధానమైందని చెప్పవచ్చు. డబ్బు లేకపోతే ఏ పని చేయలేం. ప్రపంచ దేశాలన్నీ డబ్బుపైనే ఆధార పడ్డాయి. మనుషులకు కూడా డబ్బే ముఖ్యంగా మారింది. అందుకోసం ఎవరైనా సరే ఏం చేయడానికి అయినా సరే వెనుకాడడం లేదు. ఇక హిందువులు మాత్రం డబ్బంటే లక్ష్మీదేవితో సమానమని భావిస్తుంటారు. అందుకనే డబ్బును ఎవరూ నిర్లక్ష్యం చేయరు. పొరపాటున కింద పడ్డా కూడా మళ్లీ కళ్లకు అద్దుకుని తీసుకుంటారు. అంతటి మహత్తు డబ్బుకు ఉంది. అయితే చాలా మంది మంగళ, శుక్ర వారాల్లో డబ్బును ఇచ్చేందుకు ససేమిరా అంటుంటారు. ఆయా రోజుల్లో వారు డబ్బును ఇవ్వరు. అయితే నిజంగానే ఆ రోజుల్లో డబ్బును అప్పుగా ఇవ్వకూడదా.. అసలు శాస్త్రాలు ఏమంటున్నాయి..? పండితులు ఇందుకు ఏమని సమాధానం చెబుతున్నారు..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మంగళవారానికి కుజ గ్రహం అధిపతి. ఆయన యుద్ధ కారకుడు. అలాగే మంగళ అంటే శుభం అని అర్థం. అలాంటి రోజు డబ్బును అప్పుగా ఇస్తే ఆ డబ్బు మళ్లీ వెనక్కి రాదని.. ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటారని భావిస్తుంటారు. అందుకనే మంగళవారం ఎవరూ డబ్బును అప్పుగా ఇవ్వరు. అలాగే కొందరు ఈ రోజు డబ్బు ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకడుగు వేస్తుంటారు. ఇక ఇదే సూత్రాన్ని శుక్రవారం విషయంలోనూ చాలా మంది పాటిస్తున్నారు. శుక్రవారం.. అంటే లక్ష్మీదేవికి పూజ చేసే రోజు. అందుకని లక్ష్మీవారం అని కూడా అంటుంటారు. అలాంటి రోజున డబ్బును ఎవరికైనా సరే అప్పుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి వెనక్కి రాదని భావిస్తుంటారు. అందుకనే శుక్రవారం కూడా అప్పు ఇవ్వరు. డబ్బులను ఖర్చు చేయరు.
అయితే వాస్తవానికి.. ఇలా మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బును ఇవ్వరాదనే విషయాన్ని శాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు. దీన్ని ఒక అపోహగా సృష్టించారు. అందుకనే దాన్ని చాలా మంది పాటిస్తూ వస్తున్నారు. అంతేకానీ.. ఆయా రోజుల్లో డబ్బు అప్పుగా ఇవ్వరాదు.. అని శాస్త్రాల్లో ఎక్కడా లేదు. కనుక మంగళ, శుక్రవారాల్లో డబ్బులను ఖర్చు చేయవచ్చు. అలాగే అప్పుగా కూడా ఇవ్వవచ్చు. అయితే ఈ విషయం తెలిసిన తరువాత కూడా ఇంకా ఎవరికైనా పైన చెప్పిన లాంటి భయం ఉంటే.. అందుకు ఇక ఎవరూ ఏమీ చేయలేరు.
అయితే మంగళ, శుక్రవారాల సంగతి అటుంచితే.. సాయంత్రం అయిన తరువాత అంటే సూర్యాస్తమయం తరువాత ఎవరికీ అప్పు ఇవ్వకూడదని మాత్రం శాస్త్రాలు చెబుతున్నాయి. కేవలం సూర్యోదయం అయ్యాకే అప్పు ఇవ్వాలి. తిరిగి సూర్యాస్తమయం అయ్యే వరకు అందుకు అవకాశం ఉంటుంది. కానీ సూర్యాస్తమయం అయ్యాక మాత్రం ఎవరికీ అప్పు ఇవ్వరాదు. దీని గురించి శాస్త్రాల్లో చెప్పారు. కనుక ఈ నియమం పాటిస్తే చాలు. ఇక ఈ నియమం వారంలో అన్ని రోజులకు వర్తిస్తుంది. 7 రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కనుక వారంలో ఏ రోజు అయినా సరే సాయంత్రం అయ్యాక డబ్బును అప్పుగా ఇవ్వకండి. ఇస్తే మళ్లీ రాదనే విషయాన్ని గుర్తుంచుకోండి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…