Saami Saami : దుమ్మురేపుతోన్న సామి సామి సాంగ్‌..!

October 28, 2021 3:09 PM

Saami Saami : పుష్ప : ది రైజ్ మూవీ నుంచి 3వ పాట‌గా విడుద‌లైన సామి సామి సాంగ్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. యూట్యూబ్‌లో రికార్డుల‌ను క్రియేట్ చేసే దిశ‌గా ఈ సాంగ్ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే ఈ సాంగ్ కు 23 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. దీంతో ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది.

Saami Saami song creating sensation in youtube

దేవిశ్రీ‌ప్ర‌సాద్ మ‌రోసారి ఈ పాట‌తో మ్యాజిక్ చేశాడ‌ని చెప్ప‌వ‌చ్చు. సాంగ్‌ను అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాట‌లో ఫీమేల్ లీడ్ ర‌ష్మిక త‌న ల‌వ్‌ను అల్లు అర్జున్‌కు చెబుతుంది. దీంతో పాట‌లో లిరిక్స్‌ను కూడా ఆ విధంగా క్యారీ చేశారు.

మొద‌టి పాట దాక్కో మేక మాస్ హిట్ కాగా, రెండో పాట శ్రీ వ‌ల్లి మెలొడీగా హిట్ అయింది. ఇక మూడో పాటు సామి సామి డ్యాన్స్ నంబ‌ర్‌గా హిట్ అయింది.

పుష్ఫ మూవీకి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది. డిసెంబ‌ర్ 17వ తేదీన విడుద‌ల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now