RRR Movie : రాజ‌మౌళికి స‌ల్మాన్ స‌పోర్ట్‌.. ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ బాధ్య‌త మోయ‌బోతున్నాడా…!

November 20, 2021 5:33 PM

RRR Movie : ఇండియ‌న్ మోస్ట్ ప్ర‌స్టేజియ‌స్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. భారీ బ‌డ్జెట్‌తో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు హీరోలుగా రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానున్న ఈ సినిమాపై అభిమ‌నుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రో వైపు  ఈ చిత్రానికి 400 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్‌ని భారీగా చేస్తున్నారు. ద‌ర్శక దిగ్గజం రాజమౌళి ముంబైలో తాజాగా సల్మాన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

RRR Movie rajamouli met salman khan in mumbai for movie promotion

ఇంత పెద్ద సినిమా ప్రమోష‌న్ కోసం టీమ్ అంతా దేశం మొత్తం చుట్టేయాల్సిన అవసరం ఏర్పడింది. అవసరం మేర ఇతర భాషల బిగ్ స్టార్స్ ని రంగంలోకి దించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ ని రంగంలోకి దించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ముంబైలో కుమారుడు కార్తికేయతో రాజమౌళి మీడియా కంట పడిన సంగతి తెలిసిందే. మరి ముంబైలో జక్కన్నకు పనేంటి ? అంటే.. సల్మాన్ ని ప్రమోషన్ కోసం ఆహ్వానించాలని కుమారుడిని వెంట పెట్టుకుని వెళ్లారనే టాక్ వినిపిస్తోంది.

ఆర్ఆర్ఆర్ కి బాలీవుడ్ మార్కెట్ కీలకం కాబట్టి అక్కడ ముందుండి సల్మాన్ ప్రమోట్ చేస్తే కోట్లాది రూపాయల పబ్లిసిటీ ఉచితంగానే లభిస్తుంది. అందుకే జక్కన్న ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో నిజం ఎంత ? అన్నది తేలాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో `భజరంగి భాయిజాన్` చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ముందుగా జక్కన్నకే దక్కింది. బాహుబ‌లి షూటింగ్‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో జక్న‌న్న ఆ సినిమా చేయ‌లేకపోయాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment