RRR : ప్రస్తుతం యావత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ పీరియాడికల్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. తొలి సారి రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు కలిసి నటిస్తుండడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి.
రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ వేగవంతం చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి కొమురం భీమ్ గా నటించిన ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి డిజైన్ చేసిన సాంగ్ ప్రోమోని ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రమోషనల్ సాంగ్ గా సాలిడ్ విజువల్స్ తో కనిపిస్తున్నా ఇది మాత్రం సుద్దాల అశోక్ తేజ సాహిత్యంగా బలమైన భావోద్వేగాలతో కూడుకొని ఉన్నట్టుగా అనిపిస్తోంది. కాలభైరవ ఇంటెన్స్ వాయిస్ లో ఈ సాంగ్ శ్రోతలని ఎంతగానో ఆకట్టుకోనుంది.
శుక్రవారం సాయంత్రం ఈ సాంగ్ ఫుల్ వర్షెన్ విడుదల కానుంది. ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. బజ్ ప్రకారం హైదరాబాద్ లో ‘ఆర్ఆర్ఆర్’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారట మేకర్స్. చిత్రబృందం ఇంకా ఈ వేడుకకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించలేదు. అయితే ఊహాగానాల ప్రకారం చిరు, బాలయ్య ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…