RRR : భీమ్ ప్రోమో.. ప్రేక్ష‌కుల‌కి పిచ్చెక్కిస్తుందిగా..!

December 23, 2021 8:17 PM

RRR : ప్రస్తుతం యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ పీరియాడిక‌ల్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. తొలి సారి రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు కలిసి నటిస్తుండడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి.

RRR bheem promo attracting netizen very much

రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్రమోష‌న్ స్పీడ్ వేగ‌వంతం చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి కొమురం భీమ్ గా నటించిన ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి డిజైన్ చేసిన సాంగ్ ప్రోమోని ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రమోషనల్ సాంగ్ గా సాలిడ్ విజువల్స్ తో కనిపిస్తున్నా ఇది మాత్రం సుద్దాల అశోక్ తేజ సాహిత్యంగా బలమైన భావోద్వేగాలతో కూడుకొని ఉన్నట్టుగా అనిపిస్తోంది. కాలభైరవ ఇంటెన్స్ వాయిస్ లో ఈ సాంగ్ శ్రోత‌ల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకోనుంది.

శుక్రవారం సాయంత్రం ఈ సాంగ్ ఫుల్ వ‌ర్షెన్ విడుద‌ల కానుంది. ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందించిన విష‌యం తెలిసిందే. బజ్ ప్రకారం హైదరాబాద్‌ లో ‘ఆర్ఆర్ఆర్’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారట మేకర్స్. చిత్రబృందం ఇంకా ఈ వేడుకకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించలేదు. అయితే ఊహాగానాల ప్రకారం చిరు, బాలయ్య ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now