Kondapolam : క్రిష్ కొండపొలం నుంచి విడుదలైన రొమాంటిక్ సాంగ్.. వైష్ణవ్, రకుల్ కెమిస్ట్రీ అదుర్స్..!

October 1, 2021 3:23 PM

Kondapolam :  మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “కొండపొలం”. కొండపొలం అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, వైష్ణవ్ తేజ్ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేశాయి.

Kondapolam : క్రిష్ కొండపొలం నుంచి విడుదలైన రొమాంటిక్ సాంగ్.. వైష్ణవ్, రకుల్ కెమిస్ట్రీ అదుర్స్..!

ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 8వ తేదీన థియేటర్లలో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు.  ‘శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా’.. అంటూ సాగిపోయే ఈ రొమాంటిక్ ఈ పాటను విడుదల చేశారు.

https://youtu.be/A8DC_pc6WfE

ఈ పాటకు కీరవాణి సాహిత్యం అందించగా, యామిని ఘంటసాల, పీవీఎస్‌ఎన్‌ రోహిత్‌ ఆలపించారు. ఈ పాటలో రకుల్, వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా వచ్చాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీన విడుదల కానుండడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now