Roja : 1990 దశాబ్దంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో మంచి క్రేజ్ ఉన్న తారలలో రోజా కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి రోజా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాకుండా అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళంలో కూడా రోజాకి మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో కూడా రోజా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సమ్మక్క సారక్క వంటి సినిమాల్లో కూడా రోజా అదరగొట్టింది.
రోజా ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించారు. తిరుపతి పద్మావతి మహిళా యునివర్సిటీలోనే చదువుకున్నారు. అంతే కాకుండా నాగార్జున యునివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ పూర్తి చేశారు. చదువుకునే టైంలోనే నటన పై ఉన్న మక్కువతో రోజా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటన పరంగా ఎన్నో అవార్డులను దక్కించుకుంది రోజా. దివంగత మాజీ ఎంపీ శివప్రసాద్.. రోజాకు సినిమాల్లో ఆమెకు గురువు. రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. ఆమె పేరును రోజాగా మార్చింది కూడా శివప్రసాదే.
2002 లో రోజా తమిళ దర్శకుడు ఆర్ కే సెల్వామణిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. సెల్వమణి వివాహం చేసుకున్న తరవాత రోజాకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో రోజా సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ స్థాపించారు. తన ప్రొడక్షన్ లోనే భర్త దర్శకుడిగా అనేక చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాలు తీయటం కోసం రోజా తాను ఆరు సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తాన్ని ఖర్చు చేశారట.
అయితే సొంతంగా తీసిన మూడు సినిమాలకు మంచి టాక్ వచ్చినా ఆశించిన మేరకు మంచి ఫలితాలు అందుకోలేకపోయాయి. దాంతో ఆ సినిమాలకు నష్టాలను చవి చుడాల్సి వచ్చింది. అలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే రోజా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004, 2009 సంవత్సరాల్లో నగరి, చంద్రగిరి నియజకవర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయారు రోజా. ఈ క్రమంలో రోజా ఆర్థికంగా మరింత నష్టపోయారు.
ఇక 2013 లో జబర్దస్త్ కామెడీ షో ప్రారంభం కాగా ఆ షో లో జడ్జి గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ షో ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందడంతో ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న రోజాకి మల్లెమాల సంస్థ ద్వారా అత్యధికంగా పారితోషికం అందింది. రోజా ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో జబర్దస్త్ షో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రోజా మంత్రి పదవి లో తన పని తాను సక్రమంగా చేస్తూ ముందుకు వెళుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…