Viral Video : పెళ్లి అంటే.. ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్ లు, షామియానాలు, కాంట్రాక్టు వంటకాలు, పెళ్లి ప్యాకేజి పేరుతో అంతా అరువు తెచ్చుకున్న మనుషులు కాదు. పెళ్ళంటే జన్మకి ఒకేసారి జరిగే పండుగ. రెండు మనసులు జీవితకాలం కలిసుండటానికి వేసే తొలి అడుగు.. రెండు కుటుంబాలు జీవితకాలం రక్త సంబంధీకుల్లా కలిసి పోయే ఒక మహత్తర ఘట్టం. కొన్ని వేలమంది బంధుమిత్రులు దశాబ్దాల తర్వాత ఈ వేడుకలో కలిసి చెప్పుకునే ఆత్మీయ ముచ్చట్లు.. ఈ మధ్యకాలంలో పిల్లలు తమకు నచ్చిన అబ్బాయి లేదా అమ్మాయిని చూపించి వారినే పెళ్లి చేసుకుంటామని చెబుతుంటారు.
దీనికి కొందరు పేరెంట్స్ అంగీకరిస్తుంటే మరికొందరు పిల్లల ఒత్తిడి మేరకు అంగీకరిస్తున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని వారిని చేసుకుని పెళ్లి తర్వాత బాధపడే బదులు.. బాగా తెలిసిన అబ్బాయి లేదా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని నేటి యువత భావిస్తోందట.. ఈ క్రమంలో తమిళ సంప్రదాయంలో ఓ జంట పెళ్లి చేసుకుంది. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరగగా.. అమ్మాయి, అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు వీడియో చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. అయితే, పెళ్ళి కొడుకు తాళికట్టే వేళ పెళ్లికూతురు ఓవర్ ఎక్సైట్ అయ్యింది.
ఆనందంతో చప్పట్లు కొట్టింది. అబ్బాయి తాళి కడుతున్నంత సేపు సైలెంట్‌గా చూస్తూ కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంది. ఈ రోజు కోసం ఆమె ఎంతగా ఎదురు చూసిందో అర్థమవుతుంది. తాళి కట్టిన అనంతరం ఆనందాన్ని ఆపుకోలేక అందరి ముందు పెళ్లి కొడుకు బుగ్గపై ముద్దుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పెళ్లి వీడియోను చూసి చాలా జంటలు కంగ్రాట్స్ అని విషెస్ చేస్తున్నారు. మరికొందరు అయితే అబ్బాయి కంటే అమ్మాయి చాలా సంతోషంగా ఉందనగా.. ఇంకొందరు ఇంకో సంవత్సరం తర్వాత కనిపించండి అంటూ కామెంట్ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…