Roja : టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది నటి రోజా. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరితోనూ కలసి ఆమె నటించింది. ఇలా సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకుంది. పొలిటికల్ ఫీల్డ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ రోజా సొంతం. మొదట తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత వైసీపీలో జాయిన్ అయి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా రాణిస్తున్నారు.
రోజా రాజకీయ రంగంలో ఉంటూనే మరోపక్క బుల్లితెర షోస్ అయిన జబర్దస్త్ వంటి కామెడీ షోలలో జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకున్నారు. రోజా మంత్రి అయ్యాక.. పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించారు. అయితే ఇప్పుడు రోజా కుమార్తె అన్షు మాలిక వెండి తెరంగ్రేటం చేసేందుకు సిద్ధంగా ఉందట. అన్షును హీరోయిన్‌గా చేసేందుకు రోజా ప్రయత్నిస్తోందన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అన్షు మాలిక ఇప్పటికే యూఎస్ లోని ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు రావడంతో అక్కడ శిక్షణ పొందుతోంది.
అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఆమె సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. టాలీవుడ్ సినీ వారసుడు హీరోగా నటించే సినిమాతోనే అన్షు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తోంది. నిన్నటి తరం హీరోయిన్లలో ఇప్పటికే రాధ కూతుళ్లు తులసి, కార్తీక, మంజుల కూతుళ్లు ముగ్గురు, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కేవలం జాన్వీ కపూర్ మాత్రమే సక్సెస్ హీరోయిన్‌గా రాణిస్తోంది. మరి రోజా కూతురు అన్షు సినిమా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…