Review Lakshman : మేం ఎలాంటి త‌ప్పు చేయ‌లేదు.. అస‌లు విష‌యం చెప్పిన రివ్యూ ల‌క్ష్మ‌ణ్‌..!

May 2, 2022 10:42 PM

Review Lakshman : న‌టుడు విశ్వ‌క్ సేన్ త‌న సినిమా విడుద‌ల సంద‌ర్భంగా మూవీని ప్ర‌మోట్ చేసేందుకు చేసిన ప్రాంక్ వీడియో వ్య‌వ‌హారం దెబ్బ కొట్టింది. ఆయ‌న‌పై, అందులో న‌టించిన వారు.. దాన్ని చిత్రీక‌రించిన‌వారిపై హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ విష‌యం చిలికి చిలికి గాలివాన‌గా మారుతోంది. ఈ విష‌యంలో యాంక‌ర్ దేవికి, న‌టుడు విశ్వ‌క్ సేన్‌కు మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క్ర‌మంలోనే నెటిజ‌న్లు విశ్వ‌క్ సేన్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అయితే స‌ద‌రు ప్రాంక్ వీడియోలో న‌టించిన రివ్యూయ‌ర్ ల‌క్ష్మ‌ణ్ అస‌లు ఈ విష‌యంలో ఏం జ‌రిగిందో చెప్పాడు.

Review Lakshman told truth about prank video
Review Lakshman

విశ్వ‌క్ సేన్ న‌టించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా మే 6వ తేదీన విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌, చిత్ర‌యూనిట్.. రివ్యూయ‌ర్ ల‌క్ష్మ‌ణ్ తో ప్రాంక్ వీడియో చేయించారు. అందులో ల‌క్ష్మ‌ణ్ పెట్రోల్ డ‌బ్బా ప‌ట్టుకుని వ‌చ్చి ఒంటి మీద పోసుకుని సూసైడ్ చేసుకుని చ‌నిపోతా అని చెప్తాడు. దీంతో విశ్వ‌క్ సేన్ అడ్డుప‌డి స‌ముదాయించి పంపించేస్తాడు. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో వెనుక అస‌లు ఏం జ‌రిగిందో తెలియ‌క‌పోవ‌డంతో.. అంద‌రూ ఇది నిజ‌మే అని న‌మ్మారు. కానీ అస‌లు విష‌యం తెలిశాక ఇలా చేసినందుకు వారిపై నెటిజ‌న్లు మండిప‌డ్డారు.

అయితే ఈ ప్రాంక్ వీడియో చేసిన ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ.. మేం మూవీ ప్రమోషన్స్ మాత్రమే చేశాం.. డైరెక్షన్ టీం చెప్పినట్టే నేను చేశాను.. నేను పెట్రోల్ పోసుకున్నట్టు చేశా.. కానీ అందులో ఉన్నది పెట్రోల్ కాదు.. వాటర్.. అది జనానికి కూడా తెలుసు. మేం ఎవరికీ ఇబ్బంది లేకుండానే ఫ్రాంక్ వీడియో చేశాం.. అని అన్నాడు. అలాగే ఈ విష‌యంలో కేసులు అదీ ఇదీ అంటున్నారు.. బూతులు తిట్టిస్తున్నారు. ముందు వాళ్లపై కేసులు పెట్టాలి. ట్రాఫిక్‌కి కూడా మేం అభ్యంతరం కలిగించలేదు.. నిజంగానే ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నాం.. మేం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఫన్నీగా చేశాం. చాలామంది నెగెటివ్‌గా వీడియోలు చేస్తున్నారు. మేం అయితే ఏ తప్పు చేయలేదు.. అంటూ స్ప‌ష్టంగా చెప్పాడు. ఈ క్ర‌మంలోనే ల‌క్ష్మ‌ణ్ తాజా వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఈ వివాదం ఎప్ప‌టికి స‌ద్దుమ‌ణుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now