Republic Movie : రిపబ్లిక్ మూవీ ప్రీమియ‌ర్ షో ను చూసిన సెల‌బ్రిటీలు.. బొమ్మ అదిరింద‌ని కితాబు..

September 30, 2021 1:03 PM

Republic Movie : దేవాక‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో సాయి ధ‌ర‌మ్ తేజ్‌, ఐశ్వ‌ర్య రాజేష్‌, జ‌గ‌ప‌తి బాబులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాబోతున్న చిత్రం రిప‌బ్లిక్‌. ఈ మూవీ అక్టోబ‌ర్ 1వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే టీజ‌ర్‌, ట్రైల‌ర్ ద్వారా ఈ మూవీకి మంచి ఆద‌ర‌ణ వ‌స్తోంది. దీంతో ఈ సినిమా హిట్ అవుతుంద‌ని చిత్ర యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది.

Republic Movie : రిపబ్లిక్ మూవీ ప్రీమియ‌ర్ షో ను చూసిన సెల‌బ్రిటీలు.. బొమ్మ అదిరింద‌ని కితాబు..
Republic Movie

ఇక రిపబ్లిక్ మూవీకి గాను కొంద‌రు సెల‌బ్రిటీలు ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోను చూశారు. దీంతో వారు కూడా మూవీ బాగుంద‌ని కితాబిచ్చారు. న‌టుడు నాని ఈ సినిమా చూసి ట్వీట్ చేశారు. రిప‌బ్లిక్ మూవీ చూశా. సాయి కోసం అభిమానుల ప్రార్ధనలు రిపబ్లిక్ రూపంలో ఫలిచించాయి. దేవాకట్టా చెప్పినట్లు సాయి తేజ్ ఈజ్ బ్యాక్. టీం అందరికీ కంగ్రాట్స్ అని.. నాని ట్వీట్ చేశారు.

ఇక ఈ మూవీని చూసిన సింగ‌ర్ స్మిత కూడా దీనిపై త‌న అభిప్రాయాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. మూవీ అద్భుతంగా ఉంద‌ని, దేవా క‌ట్టాకు రిప‌బ్లిక్ కొత్త ప్ర‌స్థానం అని, సాయి తేజ్ బాగా చేశాడ‌ని, రాజకీయాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాను చూడాల‌ని, అంద‌రి స్పంద‌న కోసం ఎదురు చూస్తున్నాను.. అంటూ స్మిత పోస్ట్ చేసింది.

అయితే ఈ మూవీ ప్రీమియ‌ర్ షోను చూసిన ఇత‌ర సెల‌బ్రిటీలు కూడా పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇచ్చారు. దీంతో మూవీ క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు ధీమాగా ఉన్నారు. కాగా సాయి ధ‌ర‌మ్ తేజ‌కు రోడ్డు ప్ర‌మాదంలో గాయాలు కావ‌డంతో హాస్పిట‌ల్‌లో కాల‌ర్ బోన్‌కు శ‌స్త్ర చికిత్స చేశారు. దీంతో ఆయ‌న ప్ర‌స్తుతం కోలుకుంటున్నారు. ఆయ‌న ఓకే చెప్ప‌డంతోనే సినిమాను విడుద‌ల చేస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now