Renu Desai : దాన్ని నేను ఎప్పుడూ వాడ‌లేదు : రేణు దేశాయ్‌

June 18, 2022 8:09 AM

Renu Desai : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య‌, న‌టి రేణు దేశాయ్ ఈ మ‌ధ్య‌కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ మ‌ధ్యే ఓ చోట‌ కొబ్బ‌రి బొండాల‌ను తాగుతూ బొండాల‌ను నేరుగా అలాగే తాగాల‌ని.. ఎలాంటి స్ట్రాల‌ను ఉప‌యోగించ‌రాద‌ని.. దీంతో ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో హాని క‌లుగుతుంద‌ని.. తెలియ‌జేసింది. అయితే ఆమె ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికురాలు. అలాగే మూగ‌జీవాల ప‌ట్ల జ‌రిగే హింస‌పై కూడా స్పందిస్తుంటుంది. దీంతోపాటు అప్పుడ‌ప్పుడు త‌న కొడుకు అకీరా నంద‌న్‌, కుమార్తె ఆద్య‌ల‌కు చెందిన పోస్ట్‌లను పెడుతుంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమె పోస్టులు వైర‌ల్ అవుతుంటాయి.

ఇటీవ‌లే అకీరా నంద‌న్ కు చెందిన గ్రాడ్యుయేష‌న్ డేలో ఆమె పాల్గొంది. ఆ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ కూడా హాజ‌రు కావ‌డం విశేషం. దీంతో చాలా రోజుల త‌రువాత వీరిద్ద‌రినీ ఒకే ఫ్రేమ్‌లో చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. ఇక తాజాగా రేణు దేశాయ్ మ‌రొక పోస్ట్ పెట్టింది. అదేమిటంటే.. అమెరికాలో స‌న్ స్క్రీన్ లోష‌న్స్‌ను ఎక్కువ‌గా వాడుతున్నార‌ని.. అయితే వారిలో చాలా మంది చ‌ర్మ క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నార‌ని తెలిపింది. ఈ క్ర‌మంలోనే స‌న్ స్క్రీన్ లోష‌న్స్ విష‌యానికి వ‌స్తే తాను వాటిని ఇప్ప‌టి వ‌ర‌కు వాడ‌లేద‌ని తెలిపింది. బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ఎండ నుంచి ర‌క్ష‌ణ కోసం ఈ లోష‌న్స్ రాసుకుంటార‌ని.. కానీ ఇవి మ‌న ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌జేస్తాయ‌ని.. క‌నుక‌నే కాస్మొటిక్స్‌ను ఆద్య‌, అకీరా వాడ‌కుండా చూస్తుంటాన‌ని.. రేణు దేశాయ్ తెలియ‌జేసింది.

Renu Desai said she never used sun screen lotion
Renu Desai

ఇక క‌రోనా స‌మ‌యంలో రేణు దేశాయ్ సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంది. కానీ స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌తో క‌లిసి పేద‌ల కోసం ప‌నిచేసింది. అయితే స‌న్ స్క్రీన్ లోష‌న్ల విష‌యంలోనే కాదు.. ఇతర కాస్మొటిక్స్‌ను కూడా గుడ్డిగా వాడ‌కండి.. అంటూ రేణు దేశాయ్ యువ‌త‌కు పిలుపునిచ్చింది. కాగా రేణు దేశాయ్ ప్ర‌స్తుతం ఆద్య అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనే టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు సినిమాలో క‌నిపించ‌నుంది. ఇందులో ఆమె కీల‌క‌పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now