Renu Desai : రెండో పెళ్లికి సిద్ధమైన రేణూ దేశాయ్..? జీవితంలో తోడు కావాలంటూ పెట్టిన పోస్ట్ వైరల్..!

September 5, 2022 8:11 PM

Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయిన విషయం తెలిసిందే. పవన్‌తో విడాకుల అనంతరం రేణు తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఒకప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లతో టచ్‌లో ఉండేది. పైగా కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ టైంలో ఎంతో మందికి సాయం చేసి మంచి మనసును చాటుకుంది రేణూ దేశాయ్. కరోనా తరువాత సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది.

తాజాగా రేణు దేశాయ్ ఇన్ స్టా లో చేసిన పోస్ట్ లు ఆమె రెండవ వివాహం గురించి చర్చకు దారితీశాయి. జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి అంటూ ఒక సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్న వీడియో పోస్ట్ చేసింది. మరో పోస్ట్ లో.. మీ సోల్ మేట్ ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అంటూ కామెంట్ పెట్టింది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ రెండో పెళ్లికి సంబంధించిన విష‌యంపై చ‌ర్చ న‌డుస్తుంది. అయితే గతేడాది రెండో పెళ్ళికి రెడీ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి.

Renu Desai getting ready for second marriage post viral
Renu Desai

ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు కాబోయే రెండో భర్త ఫేస్ ను దాచేసిన రేణు.. అతడి చేతికి ఉన్న రింగ్ ను చూపించేలా ఫోటో పెట్టింది. అలాగే గ‌తేడాది ఆలీతో సరదాగా షో కి వచ్చిన రేణూదేశాయ్ తన రెండో భర్త గురించి కొన్ని విషయాలు మాత్రం చెప్పింది. అతడు ఓ ఐటీ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడ‌ని.. ముందు అత‌డు అమెరికాలో ఉద్యోగం చేసే వాడని, వాళ్ళ తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇండియాకు వచ్చి పూణేలో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పింది. త‌ర్వాత అత‌ని గురించి ఏ విష‌యం రివీల్ చేయ‌లేదు. అయితే రేణూదేశాయ్ ఆ వ్యక్తినే వివాహం చేసుకోనుందా, లేక మరొకరా అనేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment