Raviteja : క‌రోనా క‌ష్ట‌కాలంలో భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచిన ర‌వితేజ‌..?

November 2, 2021 9:11 PM

Raviteja : గ‌త కొంత కాలంగా స‌రైన హిట్స్ లేక ఇబ్బంది ప‌డుతున్న ర‌వితేజ క్రాక్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. దీంతో వ‌రుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి అనే సినిమాని ఇప్ప‌టికే పూర్తి చేసిన ర‌వితేజ .. శరత్‌ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’, త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో ‘ధ‌మాకా’మూవీ చేస్తున్నారు. రీసెంట్‌గా త‌న 70వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేశారు.

Raviteja reportedly increased his remuneration very huge

నవంబర్ 5వ తేదీన ఉదయం 10:08 గంటలకు ఈ మూవీ టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సుధీర్ వర్మ దర్శకుడు. ఇక 71వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. బుధవారం మధ్యాహ్నం 12 : 06 నిమిషాలకు అనౌన్స్ మెంట్ రాబోతోంది. రవితేజ ఈ సినిమాలో కూడా నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించబోతున్నారని టాక్. అయితే వ‌రుస సినిమాలు చేస్తున్న ర‌వితేజ త‌న‌ రెమ్యునరేషన్ రూ.18 కోట్ల మార్క్ కి సెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

రవితేజ మళ్లీ ట్రాక్ లో పడడంతో వరుస సినిమాలను చేస్తూ, దానికి తగ్గట్లే రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు. త‌న 70వ సినిమాకి అభిషేక్ నామాతోపాటు రవితేజ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. కాబట్టి లాభాల్లో వాటా తీసుకోబోతున్నాడు. ఇదిలా ఉంటే టైగర్ నాగేశ్వరావు బయోపిక్. చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు.

ఈ సినిమాకి ర‌వితేజ ఓకే చెప్ప‌గా, దర్శకుడు వంశీ కృష్ణ రూపొందించనున్న ఈ సినిమాకి అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి ఒక్క రవితేజ రెమ్యునరేషనే రూ.18 కోట్లట. మ‌రి ఈ రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ ఇస్తే ర‌వితేజ‌కి ఎంత వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment