Ravi Prakash : భారీ ఎత్తున ఓ స‌రికొత్త మీడియా సంస్థ‌ను నెల‌కొల్ప‌నున్న ర‌వి ప్ర‌కాష్ ?

January 28, 2022 5:30 PM

Ravi Prakash : టీవీ9 ఫౌండ‌ర్‌, సీఈవోగా ర‌విప్ర‌కాష్ ఒక వెలుగు వెలిగిన విష‌యం విదిత‌మే. టీవీ9 మాతృసంస్థ అయిన అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఏబీసీఎల్‌) నుంచి ఆయ‌న వైదొలిగాక కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న అరెస్ట్ అయ్యారు. త‌రువాత బెయిల్‌పై విడుద‌ల అయ్యారు. అప్ప‌టి నుంచి ఆ కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

Ravi Prakash reportedly in plan of opening a new big media house

ఇక ఆయన తొలివెలుగు, రాజ్ న్యూస్ టెలివిజ‌న్ చాన‌ల్‌ల‌ను తెర‌వెనుక ఉండి న‌డిపిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజా మ‌రొక న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ర‌విప్ర‌కాష్ భారీ ఎత్తున ఓ మీడియా సంస్థ‌ను నెల‌కొల్ప‌నున్నార‌ని తెలుస్తోంది. టీవీ9 ను విజ‌య‌ప‌థంలో న‌డిపించిన అనుభ‌వం ఉంది క‌నుక భారీ ఎత్తున ఓ మీడియా సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న చూస్తున్నార‌ట‌. అది కూడా 7 భార‌తీయ భాష‌ల్లో ఒకేసారి ప్రారంభం కానుంద‌ట‌. డిజిట‌ల్ న్యూస్ యుగంలో ఆయ‌న మీడియా సంస్థ ఓ కొత్త ఒర‌వ‌డి సృష్టించేలా ఉండ‌బోతుంద‌ని టాక్ వినిపిస్తోంది.

ఇక ఆ మీడియా సంస్థ‌కు మిడిల్ ఈస్ట్ సావ‌రిన్ ఫండ్‌, సిలికాన్ వాలీ మీడియా టెక్నాల‌జీ ఈక్విటీలు ఆర్థిక స‌హాయం అందిస్తాయ‌ని తెలుస్తోంది. అయితే ర‌విప్ర‌కాష్ కొత్త మీడియా సంస్థ‌తో పూర్వ వైభ‌వం తెచ్చుకుంటారా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now