Rashmika Mandanna : త‌న ఫిట్‌నెస్ ర‌హ‌స్యాన్ని తెలియ‌జేసిన ర‌ష్మిక మంద‌న్న‌.. ఏమిటో తెలుసా..?

February 2, 2022 9:11 PM

Rashmika Mandanna : ర‌ష్మిక మంద‌న్న సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 5 ఏళ్ల‌కు పైగానే అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఆమె తెలుగు, త‌మిళం, క‌న్న‌డ ఇండ‌స్ట్రీల‌లో ప‌లు వ‌రుస సినిమాల్లో న‌టించి స‌క్సెస్ సాధించింది. దీంతో ఆమె నేష‌న‌ల్ క్ర‌ష్ ఆఫ్ ఇండియాగా మారింది. ర‌ష్మిక మందన్న త‌న క్యూట్ లుక్స్‌, గ్లామ‌ర్‌తో కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవ‌లే విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించిన పుష్ప – ది రైజ్ చిత్రం ర‌ష్మిక‌కు చ‌క్క‌ని బ్రేక్ ఇచ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇందులో శ్రీ‌వ‌ల్లి పాత్ర‌లో ఆమె ఒదిగిపోయింది. ఆమె పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప సినిమా ర‌ష్మిక‌కు కూడా మంచి హిట్‌ను, పేరును తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమాలోని సామి సామి పాట‌లో ర‌ష్మిక డ్యాన్స్ స్టెప్స్‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

Rashmika Mandanna  told about her fitness and glamour secrets
Rashmika Mandanna

ర‌ష్మిక వేసిన సామి సామి ఐకానిక్ స్టెప్‌ను చాలా మంది వేసి త‌మ స‌ర‌దా తీర్చుకుంటున్నారు. ఇక ర‌ష్మిక ఎల్ల‌ప్పుడూ గ్లామ‌ర్‌గా ఉంటుంది. అందుకుగాను ఆమె క‌ఠిన‌మైన ఫిట్‌నెస్ నియ‌మాల‌ను పాటిస్తుంది. ఈమె తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న ఫిట్ నెస్ ర‌హ‌స్యాన్ని, త‌న గ్లామ‌ర్ వెనుక ఉన్న సీక్రెట్స్‌ను తెలియ‌జేసింది.

తాను రోజూ క‌చ్చితంగా వ్యాయామం చేస్తాన‌ని.. అన్ని పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకుంటాన‌ని.. ర‌ష్మిక మంద‌న్న తెలియ‌జేసింది. వ్యాయామం చేయ‌డం ఒక్క‌టే కాదు, శారీర‌కంగా, మాన‌సికంగా దృఢంగా, బ‌లంగా ఉండాలంటే.. డైట్ కూడా ముఖ్య‌మేన‌ని.. స‌రైన ఆహారం తీసుకుంటేనే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటామ‌ని.. ఆహారం విష‌యంలో తాను క‌ఠిన‌మైన నియ‌మాల‌ను పాటిస్తాన‌ని తెలిపింది. అంటే ఈమె డైట్ ఎంత క‌ఠినంగా పాటిస్తుందో స్ప‌ష్ట‌మ‌వుతుంది. అందుక‌నే ఆమె అంత గ్లామ‌ర్‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం పుష్ప రెండో పార్ట్‌లో న‌టిస్తుండ‌గా.. శ‌ర్వానంద్‌తో క‌లిసి న‌టించిన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. అలాగే సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి న‌టించిన మిష‌న్ మ‌జ్ను అనే బాలీవుడ్ సినిమాతోపాటు గుడ్ బై అనే మ‌రో మూవీలోనూ ర‌ష్మిక న‌టిస్తోంది. ఈ మూవీలు కూడా రానున్న నెల‌ల్లో విడుద‌ల కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now