Rashmika Mandanna : ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌కి నామినేట్ కాక‌పోయినా.. ఏం ఫ‌ర్లేదు.. అది చాలు.. ర‌ష్మిక మంద‌న్న‌..

October 1, 2022 2:36 PM

Rashmika Mandanna : పుష్ప సినిమా పాన్ ఇండియా స‌క్సెస్ తో ర‌ష్మిక కెరీర్ ఊపందుకుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమా త‌రువాత ఆమెకు బాలీవుడ్ నుండి అవ‌కాశాలు వ‌రుస క‌డుతున్నాయి. అమితాబచ్చ‌న్ తో క‌లిసి న‌టించే ఛాన్స్ కూడా కొట్టేసింది. బాలీవుడ్ హీరోలు ర‌ణబీర్ క‌పూర్ తో యానిమ‌ల్ అలాగే సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో మిష‌న్ మ‌జ్నూ సినిమాలు కూడా చేయ‌నుంది. ఈ మ‌ధ్యే హిందీ భాష కూడా నేర్చుకుంటున్న‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం అమితాబచ్చ‌న్ తో క‌లిసి న‌టించిన గుడ్ బై సినిమా ప్ర‌మోష‌న్ లో ఈమె బిజీగా గ‌డుపుతుంది.

ఈ సంద‌ర్భంగా మ‌న దేశం త‌ర‌పున ఆర్ఆర్ఆర్ సినిమాకి అధికారికంగా ఆస్కార్ ఎంట్రీ రాక‌పోవ‌డంపై ర‌ష్మిక‌ను మీడియా ప్ర‌తినిధులు అడ‌గ‌డం జ‌రిగింది. దీనిపై స్పందిస్తూ ఆర్ఆర్ఆర్ సినిమాకి ప్రేక్ష‌కుల నుండి ద‌క్కిన ప్రేమ ఆస్కార్ కంటే కూడా గొప్ప‌ద‌ని చెప్పింది. అంద‌రూ ఆ సినిమాను ఎంతో ఆద‌రించార‌ని అదే అద్భుత‌మ‌ని చెప్పింది. గ‌తంలో త‌న డియ‌ర్ కామ్రెడ్ సినిమా కూడా లిస్టులో ఉన్న‌ప్ప‌టికీ చివ‌ర‌కు ఆస్కార్ కి నామినేట్ అవ‌లేద‌ని గుర్తు చేసింది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాకి ద‌క్కిన స్పంద‌న కానీ క‌లెక్ష‌న్లు గానీ సంబ‌రం చేసుకోద‌గిన‌వ‌ని త‌న అభిప్రాయాల‌ను పంచుకుంది.

Rashmika Mandanna responded on RRR movie for Oscar entry
Rashmika Mandanna

ఈ క్ర‌మంలో త‌ను ప్ర‌స్తుతం చేస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ అక్టోబ‌ర్ లో మొద‌లు కాబోతున్నట్టు తెలిపింది. అలాగే ర‌ణ‌బీర్ క‌పూర్, సిద్ధార్థ్ మ‌ల్హోత్ర సినిమాలు కాకుండా మ‌రొక బాలీవుడ్ న‌టుడు కార్తిక్ ఆర్య‌న్ తో ఆషికీ 3 చిత్రానికి సంబంధించి కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు తెలిసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now