Rashmika Mandanna : భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన రష్మిక.. పుష్ప 2కు అన్ని కోట్లా..!

September 17, 2022 7:50 PM

Rashmika Mandanna : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావ‌డానికి కొంత టైం ప‌డుతుంది. అదే కొంద‌రు మాత్రం ఒక‌టి రెండు సినిమాల‌తోనే స్టార్ స్టేట‌స్‌ను సొంతం చేసుకుంటారు. అలా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన క‌థానాయిక ర‌ష్మిక మంద‌న్న‌. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ ను తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారింది. పుష్పతో రష్మిక గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పుష్పలో రష్మిక డీగ్లామర్ రోల్ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. దీంతో బాలీవుడ్ కన్ను రష్మికపై పడింది.

త్వరలోనే బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన గుడ్‌బై సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి మిషన్‌ మజ్ను అనే మూవీకి కూడా సైన్ చేసింది. త్వరలో అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ సెట్స్‌లో ఎంట్రీ ఇవ్వనుంది ఈ అందాల భామ. అయితే ప్రస్తుతం రష్మిక రెమ్యూనరేషన్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. పుష్ప 2 కోసం పారితోషికం పెంచేసిందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి ఏకంగా రూ.4 కోట్లు అందుకుంటున్నట్లు తెలుస్తుంది.

Rashmika Mandanna reportedly increased her remuneration
Rashmika Mandanna

అదేవిధంగా ఇక నుంచి చేసే ప్రతి సినిమాకు కూడా రూ.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీపం ఉండగానే.. ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను రష్మిక బాగానే ఫాలో అవుతుందని నెటిజన్లు అంటున్నారు. పుష్ప విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌ లో 6 మిలియన్లకు పైగా ఫాల్లోవర్స్ ఉన్నారు. రష్మిక నటించిన సీతారామం ఇటీవల విడుదల కాగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రష్మిక ప్రస్తుతం తమిళ తలపతి విజయ్ తో వారసుడు, బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో యానిమల్ లో నటించనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now