Rashmika Mandanna : ర‌ష్మిక‌కు ఘోర అవ‌మానం.. గ‌తంలో ఎన్న‌డూ ఇలా జ‌ర‌గ‌లేదు..

October 10, 2022 10:56 AM

Rashmika Mandanna : ఛలో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. కొంతకాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమె పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు బడా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ భామ మరోవైపు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె గుడ్ బై అనే చిత్రంతో హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. వికాస్ బహల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నీనా గుప్తాలు ముఖ్య పాత్రలు పోషించారు.

అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. ఇదే ఆమెకు బాలీవుడ్‌లో తొలి చిత్రం. అమితాబ్ బచ్చన్ ఉన్నప్పటికీ ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌ను సంపాదించలేకపోయింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రూ.3 కోట్లు మాత్రమే వచ్చాయి. క్వీన్ మరియు సూపర్ 30 వంటి హిట్‌లను అందించిన వికాస్ బహ్ల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు కానీ అది కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.

Rashmika Mandanna new movie good bye big flop
Rashmika Mandanna

పైగా ఈ చిత్రంలో రష్మిక నటన సాధారణంగా, పేలవంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె సౌత్ ఇండియన్ యాస కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. రష్మిక రాబోయే బాలీవుడ్ మూవీలు మిషన్ మజ్ను మరియు యానిమల్ వంటి సినిమాలతో నార్త్‌లో ఇంకా కొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఆమె వాటిని పూర్తిగా ఉపయోగించుకోవాలి. లేదంటే బాలీవుడ్ లో తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే ఈ అమ్మడు. ఏదేమైనా రష్మిక గుడ్‌బై వంటి చిత్రాలను చేయకుండా ఉంటే మంచిదని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now