Rashmika Mandanna : చెమటలు పట్టేలా వ్యాయామం చేసిన రష్మిక మందన్న.. ఫొటో వైరల్‌..!

May 21, 2022 10:40 AM

Rashmika Mandanna : రష్మిక మందన్న ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. దక్షిణాదిలో ప్రస్తుతం పాపులర్‌ అయిన నటి ఎవరైనా ఉన్నారా.. అంటే.. ఆమె రష్మిక మందన్ననే అని చెప్పవచ్చు. ఈమె గీత గోవిందం సినిమాతో బంపర్‌ హిట్‌ కొట్టి తెలుగు తెరకు అతుక్కుపోయింది. తరువాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈమె నటించిన అనేక సినిమాలు హిట్‌ అయ్యాయి. ఈ మధ్యే పుష్ప మొదటి పార్ట్‌తో మన ముందుకు వచ్చింది. డి-గ్లామర్‌ రోల్‌ అయినప్పటికీ రష్మిక ఇందులో అద్భుతంగా నటించింది. దీంతో ఆమెకు బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్లు వస్తున్నాయి.

రష్మిక మందన్న సినిమా కథలను ఎంచుకునే విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తుందో.. ఫిట్‌నెస్‌ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటుంది. అందులో భాగంగానే ఆమె ఖాళీ దొరికినప్పుడల్లా జిమ్‌లో గంటల తరబడి సాధన చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటుంది. జిమ్‌లో ఈమె అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటుంది. ఇక ఈమె రీసెంట్‌గా జిమ్‌లో ఫిట్ నెస్‌ సెషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా చెమటలు వచ్చేలా వ్యాయామం చేసింది. అనంతరం తన ఫొటోను తీసి షేర్‌ చేసింది. దీంతో ఆమె ఫొటో వైరల్‌గా మారింది. జిమ్ లో ఫిట్‌ నెస్‌ కోసం తెగ కష్టపడుతున్న రష్మికను చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ పట్ల ఆమెకు ఉన్న డెడికేషన్‌ను చూసి అభినందిస్తున్నారు.

Rashmika Mandanna busy in gym workout session
Rashmika Mandanna

ఇక సినిమాల విషయానికి వస్తే.. రష్మిక మందన్న ప్రస్తుతం మిషన్‌ మజ్ను, గుడ్‌ బై అనే హిందీ మూవీల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్‌ పూర్తయింది. అలాగే తెలుగులో సీతా రామమ్‌, పుష్ప ది రూల్‌ సినిమాల్లో నటిస్తోంది. ఇవి షూటింగ్‌ దశలో ఉన్నాయి. దీంతోపాటు ఈమె విజయ్‌తో కలిసి ఓ మూవీలో చేయనుంది. అలాగే యానిమల్‌ అనే ఇంకో మూవీలోనూ నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఈమె ఎంతో బిజీగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now