Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు సౌత్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది. చేతిలో వరుసగా సినిమాలు ఉండడంతో ఈ అమ్మడు ఆగడం లేదు. ఈమె స్పీడుకు బ్రేకులు లేకుండా పోయాయి. ఇప్పటికే పలు హిందీ మూవీల్లో నటిస్తున్న ఈమెకు ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుత తరుణంలో హీరోయిన్లు డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ముఖ్యంగా బోల్డ్ సీన్లలో నటించేందుకు ఏమాత్రం మొహమాట పడడం లేదు. అయితే ఈ మాట అటుంచితే రష్మిక మందన్న తాజాగా చేసిన పని నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
ప్రముఖ నటుడు విక్రమ్ నటించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయన తన తరువాతి మూవీని కూడా అనౌన్స్ చేశారు. తమిళ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ తన 61వ సినిమాను చేయనున్నారు. అయితే ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. పైగా ఇందులో ఆమె బోల్డ్ సీన్లలోనూ నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు.
డబ్బులు ఇస్తే నీకన్నా వయస్సులో ఎంత పెద్ద హీరోతో అయినా నటిస్తావా.. బోల్డ్ సీన్లలోనూ చేస్తావా.. డబ్బుల కోసం ఏమైనా చేసే రకం నువ్వు.. అంటూ నెటిజన్లు రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని గురించి అధికారిక వివరాలు తెలియకపోయినా రష్మిక మాత్రం ట్రోలింగ్‌కు గురవుతోంది. ఇక ఈమె ప్రస్తుతం మిషన్ మజ్ను, గుడ్ బై అనే హిందీ మూవీల్లో నటించగా.. సీతారామమ్, పుష్ప 2 తెలుగు మూవీల్లో చేస్తోంది. అలాగే తమిళంలో వరిసులోనూ యాక్ట్ చేస్తోంది. హిందీలో యానిమల్ అనే మూవీలోనూ ఈమె నటించనుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…