Krithi Shetty : గతేడాదిలో సక్సెస్ సాధించిన హీరోయిన్లు ఎవరైనా ఉన్నారా.. అంటే అది కృతి శెట్టి ఒక్కరే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈమె తెలుగులో నటించింది మూడే మూడు సినిమాలు. అవి కూడా వరుసగా హిట్. తొలి మూడు సినిమాలు విజయం సాధించడంతో సహజంగానే ఈమెకు అవకాశాలు పెరిగాయి. దీంతో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. అయితే ఎంతటి వారికైనా సక్సెస్ అన్నది అన్ని సార్లు రాదు. అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ కూడా ఎదురవుతుంటాయి. ఈ క్రమంలోనే కృతిశెట్టికి కూడా మొదటి ఫెయిల్యూర్ వచ్చింది. రామ్‌తో కలసి నటించిన ది వారియర్ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఈ మూవీ మండే టెస్ట్‌లో పాస్ కాలేదు. దీంతో సినిమా ఫ్లాప్ అయినట్లు అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలోనే ఈ మూవీ ద్వారా కృతిశెట్టి తొలి ఫ్లాప్‌ను అందుకున్నట్లు అయింది.
వాస్తవానికి ఇందులో కృతి తప్పేమీ లేదు. అందివచ్చిన అవకాశం, కాదంటే ఒక వేళ సినిమా హిట్ అయితే అప్పుడు సినిమా చేయలేకపోయామే బాధ ఉండకూడదనే.. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా చేస్తోంది. అయితే చేసిన ప్రతి సినిమా హిట్ కావాలని చెప్పలేం. కొందరు స్టార్స్‌కు వరుసగా హిట్స్ పడతాయి. తరువాత ఫ్లాప్ లు వెంటాడుతాయి. సక్సెస్ అన్నది సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా వస్తుంటుంది. కానీ కృతిశెట్టికి అది తొలి మూడు సినిమాల రూపంలో వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ది వారియర్ మూవీతో తొలి ఫ్లాప్‌ను అందుకుంది.
ఇక కృతిశెట్టికి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆమె చేతిలో ఇంకో నాలుగు సినిమాలు ఉన్నాయి. నితిన్‌తో కలసి మాచర్ల నియోజకవర్గం చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 12న రిలీజ్ అవుతుంది. అలాగే ఇంద్రగంటి తీస్తున్న ఆ అమ్మాయి గురించి చెప్పాలి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీంతోపాటు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్యతో మూవీ కన్‌ఫామ్ అయింది. అలాగే తమిళ స్టార్ నటుడు సూర్యతో అచలుడు చేయనుంది. కనుక కృతిశెట్టి కెరీర్‌కు ఇప్పటికిప్పుడు జరిగే నష్టం ఏమీ ఉండదు. కానీ ఈమె సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. చేస్తున్న ఈ నాలుగు సినిమాల్లో కనీసం 2 హిట్స్ అయినా పడాలి. అప్పుడే స్టార్ హీరోయిన్‌గా మారేందుకు అవకాశాలు ఉంటాయి. మరి ఈమె భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…