Rashi Khanna : మద్రాస్ కేఫ్ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ.. రాశి ఖన్నా. తెలుగులో మనం సినిమాలో ప్రేమగా గెస్ట్ రోల్‌లో ఈమె కనిపించింది. తరువాత ఊహలు గుసగుసలాడే చిత్రంతో సందడి చేసింది. అయితే రాశి ఖన్నా కెరీర్‌లో హిట్, ఫ్లాప్ వరుసగా పడుతున్నాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయితే ఒక సినిమా హిట్ అవుతోంది. ఇలా రాశి ఖన్నా సినిమా కెరీర్ సాగుతూ వస్తోంది. ఇక ఈమె నటించిన గత చిత్రాలను చూసుకుంటే.. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈమె చూపు ప్రస్తుతం థాంక్ యూపై పడింది. ఈ క్రమంలోనే థాంక్ యూ మూవీ ఎలాగైనా సరే హిట్ కావాలని ఈమె కోరుకుంటోంది.
రాశి ఖన్నా ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 10 ఏళ్లు కావస్తోంది. ఈమెతో ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే తెరమరుగు అయ్యారు. కొందరు సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మరోవైపు కుర్ర హీరోయిన్ల నుంచి పోటీ కూడా బాగానే ఉంది. దీంతో రాశి ఖన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కచ్చితంగా ఆమెకు హిట్ కావాలి. అందుకనే ఆమె థాంక్ యూ మూవీపైనే ఆశలు పెట్టుకుంది. ఇక ఇందులో నాగచైతన్య నటించగా.. మాళవిక నాయర్, అవికా గోర్‌లు ఇతర కీలకపాత్రల్లో నటించారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా థాంక్ యూ రిలీజ్ డేట్ వచ్చేయడంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. అందులో భాగంగానే చైతూ, రాశి ఇద్దరూ ప్రమోషన్లలో పాల్గొంటూ చానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఈ మూవీ హిట్ కాకపోయినా చైతన్యకు పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే ఆయన నటించిన గత చిత్రాలు లవ్ స్టోరీ, బంగార్రాజు హిట్ అయ్యాయి. కనుక థాంక్ యూ మూవీ ఫ్లాప్ అయినా పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు. కానీ ఈ మూవీ రాశి ఖన్నాకు ఇంపార్టెంట్‌గా మారింది. ఈ క్రమంలోనే ఈ మూవీపైనే ఆశలు పెట్టుకుంది. ఈ మూవీ ఫ్లాప్ అయితే గనక ఈమె కెరీర్ ముగిసినట్లేనని అంటున్నారు. మరి థాంక్ యూ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శనను ఇస్తుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…