Rashi Khanna : ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం పలువురు హీరోల సరసన నటించి తెలుగు తెరపై అద్భుతమైన గుర్తింపు సంపాదించుకుంది. జిల్, జోరు, బెంగాల్ టైగర్, హైపర్, తొలిప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్, ప్రతి రోజు పండగే వంటి సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందింది.
ఇలా తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన రాశీ ఖన్నా రుద్ర వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించింది. ఈ విధంగా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉండే ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే తాను కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న చేదు సంఘటనలు గురించి వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కెరియర్లో ఎదుర్కొన్న విమర్శలు ఏంటి అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ కెరీర్ మొదట్లో తన శరీరాకృతి గురించి ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించింది.
దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో తనకు ఎంతో మంచి అవకాశాలు వచ్చాయని, ఇలా అద్భుతమైన అవకాశాలు రావడంతో చాలా సంతోషించానని తెలిపింది. ఇలా ఒకవైపు అవకాశాలు వస్తున్నప్పటికీ మరోవైపు చాలామంది తన శరీరాకృతి గురించి దారుణమైన కామెంట్లు చేసేవారని ఈమె వెల్లడించింది. కెరియర్ మొదట్లో చాలా మంది తనని గ్యాస్ ట్యాంకర్ అంటూ తన బాడీ షేమింగ్ గురించి మాట్లాడేవారని ఈ సందర్భంగా రాశీ ఖన్నా తెలియజేసింది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎంతో నాజుగ్గా తయారైంది. ప్రస్తుతం ఈమె తెలుగులో విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో నాగచైతన్య సరసన థాంక్యూ అనే చిత్రంలో నటించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…