Ram Gopal Varma : గత కొద్ది నెలల కిందట ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. సీఎం జగన్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని తొక్కేయాలని చూస్తున్నారని.. కనుకనే టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదని చాలా మంది సినీ పెద్దలు అన్నారు. అయితే ఈ విషయాలను పక్కన పెట్టి మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్ తదితరులు సీఎం జగన్‌ను కలిశారు. దీంతో ఎట్టకేలకు సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటును కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను రిలీజ్ చేసింది. అయితే టిక్కెట్ల ధరలను పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులకు రావడం లేదు. ఈ విషయం సినిమా ఇండస్ట్రీ వారికి బాగా తెలిసొచ్చింది. అయితే ఎవరూ ఈ విషయంపై నోరు మెదపడం లేదు. కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం బయట పడ్డారు. ఇదే విషయంపై ఆయన తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లకు రావడమే గగనం అయిపోతోంది. కరోనా వల్ల ఓటీటీల ప్రభావం పెరగడంతో ప్రేక్షకులు ఓటీటీల్లోనే సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇలాంటి స్థితిలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచితే అది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. సరిగ్గా అలాగే జరిగింది. మల్టీప్లెక్స్‌లలో ఏదైనా సినిమా రిలీజ్ అయితే టిక్కెట్ ధర ఏకంగా రూ.500 వరకు పలుకుతోంది. అదే సాధారణ థియేటర్లలో అయితే రూ.300 వరకు పలుకుతోంది. దీని వల్ల టిక్కెట్ల ధరలను చూసి ప్రేక్షకులు భయపడిపోతున్నారు. కనుకనే ఓటీటీల్లో చూద్దామని ప్రేక్షకులు ఎవరూ థియేటర్లకు వెళ్లడం లేదు. ఇదే విషయాన్ని వర్మ చెప్పారు. అయితే సినిమా టిక్కెట్ల ధరలు తక్కువగా ఉంటేనే అటు సినీ పరిశ్రమ వారికి, ఇటు ప్రేక్షకులకు సరైన న్యాయం జరుగుతుందని.. రేట్లు పెంచడం సరికాదని.. అప్పట్లోనే సీఎం జగన్ అన్నారు. కానీ అదేమీ పట్టించుకోని సినీ ఇండస్ట్రీ వారు రేట్లను పెంచుకునేందుకే మొగ్గు చూపారు. ఫలితంగా భారీగా పెరిగిన టిక్కెట్ల ధరలను చూసి ప్రేక్షకులు ఎవరూ థియేటర్లకు రావడం లేదు. ఈ విషయం ఈ మధ్య రిలీజ్ అయిన దాదాపు అన్ని సినిమాలకూ రుజువైంది. టిక్కెట్ల ధరలు ఎక్కువగా ఉండడం వల్లే థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే విషయం స్పష్టమైంది. అంటే.. మేమే తప్పు చేసినట్లు. సీఎం జగన్ చెప్పిందే కరెక్ట్. అనవసరంగా మేం పొరపాటు పడ్డాం.. తప్పు చేశాం.. అని వర్మ అన్నారు.
కాగా రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వర్మ గనుక ఉన్న విషయాన్ని ఉన్నట్లు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలోని వారు ఎవరైనా సరే ఇలా కామెంట్స్ చేయలేదు. చేస్తే.. గిల్టీ ఫీలింగ్ కలుగుతుందేమోన్న భయం కాబోలు. అందుకనే టిక్కెట్ల ధరలను పెంచడం వల్లే థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదన్న విషయాన్ని లోలోపల అంగీకరించినా ఎవరూ బయట పెట్టడం లేదు. ఒక వేళ దీనిపై ఎవరైనా బహిరంగంగా కామెంట్స్ చేయాలనుకున్నా.. నెటిజన్ల నుంచి విమర్శలు వస్తాయి. ఎందుకంటే రేట్లను పెంచాలని పట్టుబట్టింది వాళ్లే కదా.. మళ్లీ ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉండడం వల్లే ప్రేక్షకులు రావడంలేదు.. అని అంటే.. అది కరెక్ట్ ఎలా అవుతుంది. మరలాంటప్పుడు సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కాకపోతే.. రేట్లను పెంచాలని గోల చేయడం ఎందుకు ? ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టడంలో విఫలం అయ్యారా ? లేదంటే ఏపీ ప్రభుత్వంపై నిందలు వేయడం కోసమే అలా చేశారా ? వంటి ప్రశ్నలన్నీ వస్తాయి. కనుకనే ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని చూస్తున్నట్లు స్పష్టమవుతుంది. అయితే టిక్కెట్ల రేట్లు ఇలాగే ఉంటే గనుక అప్పుడు చిత్ర పరిశ్రమ మనుగడకే ముప్పు ఏర్పడుతుంది. మరి మళ్లీ అప్పుడు రేట్లను తగ్గించాలని అడుగుతారా.. ఏమో చూడాలి మరి..!
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…