Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాగా.. హిందీ మార్కెట్‌లోనూ ప్రభంజనాన్ని సృష్టించింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక త్వరలోనే పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దర్శకుడు సుకుమార్ ఇప్పటికే కథ, స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారని తెలుస్తోంది. దీంతో అతి త్వరలోనే పుష్ప 2 ను లాంచ్ చేయనున్నారు.
ఇక పుష్ప లో ఉన్న దాదాపు అన్ని ప్రధాన పాత్రలు పుష్ప 2లోనూ ఉంటాయని ఊహించవచ్చు. దాక్షాయణి, మంగళం శ్రీను, ఎస్‌పీ భన్వర్‌సింగ్ షెకావత్.. ఇలా విలన్లు అందరూ కలసి పుష్పను ఎదుర్కొంటారని ఇప్పటికే అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే కథ ఇంకా సిద్ధం కాలేదు కనుక ఇవన్నీ ఊహాగానాలే అని చెప్పవచ్చు. అయితే పుష్ప 2 గురించి ఓ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే.. పుష్ప మొదటి పార్ట్ నుంచి రెండో పార్ట్ కు కంటిన్యూ అయ్యే పాత్రల్లో ఒక పాత్రను సుకుమార్ చంపేయబోతున్నారట. అది ఎవరని ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది.
ఎలాగూ విలన్లు మూవీ ఆఖర్లో చనిపోతారని ఊహించవచ్చు. కానీ వీరు కాకుండా ఇంకో ప్రధాన పాత్రను సినిమా ఆరంభంలోనే చంపేయనున్నారట. అది శ్రీవల్లి అని కొందరు అంటుండగా.. పుష్ప ఫ్రెండ్ అని ఇంకొందరు అంటున్నారు. అయితే ఇప్పటికైతే ఇవన్నీ వైరల్ అవుతున్న వార్తలే. ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఒకవేళ నిజంగానే పుష్ప 2లో శ్రీవల్లి పాత్రను చంపేస్తే.. అది అభిమానులకు రుచిస్తుందా.. వారు ఈ ట్విస్ట్ తో సాటిసిఫై అవుతారా.. ఫలితం ఎలా ఉంటుంది.. తేడా కొడుతుందా.. అన్నవివరాలు తెలియాల్సి ఉంది. సినిమా విడుదలైతే కానీ దీనిపై క్లారిటీ రాదు. ఇక ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని తెలుస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…