Ram Charan Tej : రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్ మాట్లాడుతూ” ఈవెంట్ కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ.. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాము.. మా గురువు అనాలా.. మా హెడ్ మాస్టర్ అనాలా, ప్రిన్సిపాల్ అనాలా.. నాకు ఇండస్ట్రీ ఫస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనాలా.. మా ఇద్దరినీ కలిపి సినిమా తీసినందుకు రాజమౌళికి థాంక్స్ అని చెప్పాడు.
అనంతరం ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తనది సింహంలాంటి పర్సనాలిటీ.. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం. తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తారక్‌లాంటి నిజమైన బ్రదర్‌ని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్. తారక్‌కి థ్యాంక్స్ చెబితే మా బంధం ఇక్కడితో ముగిసిపోద్ది అనేది నా భావన.. నేను చనిపోయేవరకు ఆ బ్రదర్ హుడ్‌ని నా మనసులో పెట్టుకుంటాను’.. అంటూ చరణ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.
ఆ సమయంలో స్టేజ్ కింద రాజమౌళి పక్కన కూర్చున్న తారక్.. చెర్రీ మాటలను ఆస్వాదిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. చెన్నైలో గ్రాండ్‌గా జరిగిన ఈ ఈవెంట్‌కి తమిళ సినీ హీరోలు ఉదయనిధి, శివకార్తికేయన్, నిర్మాతలు థాను, ఆర్బీ చౌదరి, తమిళ లిరిక్ రైటర్ మదన్ కార్కీ తదితరులు వచ్చి వారు సినిమాతోపాటు హీరోలపై కూడా ప్రశంసల జల్లు కురిపించారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…