Ram Charan Tej : ప్రస్తుత కాలంలో రాజకీయాల్లో సక్సెస్ సాధించాలంటే రాజకీయ నాయకులకు కచ్చితంగా ఓ ఛానల్ ఉండాల్సిందే. ఎందుకంటే పార్టీ ప్రతిష్టను పెంచాలన్నా.. పార్టీ ప్రమోషన్స్ ని జనాల్లోకి తీసుకెళ్ళాలన్నా మీడియా ద్వారానే సాధ్యం అవుతుంది. పార్టీ పట్ల ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు గ్రాఫిక్స్ చేసి మరీ క్రియేట్ చేస్తేనే పార్టీకి బలం. అలాగే ప్రస్తుతం ఒక్కో ఛానల్ ఒక్కో పార్టీకి సపోర్ట్ చేస్తోంది.
ఆ విషయం ప్రతి ఒక్కరికీ డైరెక్ట్ గా తెలిసినా.. పరోక్షంగానే తెలిసినట్లుగా మీడియా వ్యవహార శైలి ఉంటుంది. అలాగే రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం హీరో రామ్ చరణ్ ఓ ఛానల్ ను కొని ప్రజల్లో పవన్ కళ్యాణ్ పవర్ ని బ్రాండ్ గా క్రియేట్ చేయాలని చూస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ మహా న్యూస్ ఛానల్ ను కొన్నారని గుసగుసలాడుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ ఈ ఛానల్ ని కొన్నారా, లేదా అనే విషయంపై మహాన్యూస్ ఎండీ వంశీ కృష్ణ పక్కా క్లారిటీ ఇచ్చేశారు.
ప్రస్తుతం వస్తున్న ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ.. రామ్ చరణ్ కు తనకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని అన్నారు. మహాన్యూస్ ప్రేక్షకులు ఎవరూ ఈ వార్తల్ని నమ్మొద్దని.. మహాన్యూస్ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు. ఇలా రూమర్స్ క్రియేట్ చేసేవారికి సైతం తమ దగ్గరకు వస్తే నిజానిజాలెంటో వివరిస్తామని మహాన్యూస్ ఎండీ తెలిపారు. దీంతో రామ్ చరణ్ తన బాబాయ్ కోసం ఎలాంటి ఛానల్ కొనలేదనే విషయంలో నెటిజన్లకు క్లారిటీ వచ్చేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…