గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Ram Charan Tej : బాబాయి కోసం చరణ్‌ ఛానల్ కొనుగోలు చేస్తున్నాడా.. ఛానల్ ఎండీ ఏం చెప్పారంటే..?

Ram Charan Tej : ప్రస్తుత కాలంలో రాజకీయాల్లో సక్సెస్ సాధించాలంటే రాజకీయ నాయకులకు కచ్చితంగా ఓ ఛానల్ ఉండాల్సిందే. ఎందుకంటే పార్టీ ప్రతిష్టను పెంచాలన్నా.. పార్టీ ప్రమోషన్స్ ని జనాల్లోకి తీసుకెళ్ళాలన్నా మీడియా ద్వారానే సాధ్యం అవుతుంది.…

Ram Charan Tej : బాబాయి కోసం చరణ్‌ ఛానల్ కొనుగోలు చేస్తున్నాడా.. ఛానల్ ఎండీ ఏం చెప్పారంటే..?

Ram Charan Tej : ప్రస్తుత కాలంలో రాజకీయాల్లో సక్సెస్ సాధించాలంటే రాజకీయ నాయకులకు కచ్చితంగా ఓ ఛానల్ ఉండాల్సిందే. ఎందుకంటే పార్టీ ప్రతిష్టను పెంచాలన్నా.. పార్టీ ప్రమోషన్స్ ని జనాల్లోకి తీసుకెళ్ళాలన్నా మీడియా ద్వారానే సాధ్యం అవుతుంది. పార్టీ పట్ల ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు గ్రాఫిక్స్ చేసి మరీ క్రియేట్ చేస్తేనే పార్టీకి బలం. అలాగే ప్రస్తుతం ఒక్కో ఛానల్ ఒక్కో పార్టీకి సపోర్ట్ చేస్తోంది.

Ram Charan Tej buying news channel for pawan kalyan is it true

ఆ విషయం ప్రతి ఒక్కరికీ డైరెక్ట్ గా తెలిసినా.. పరోక్షంగానే తెలిసినట్లుగా మీడియా వ్యవహార శైలి ఉంటుంది. అలాగే రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం హీరో రామ్ చరణ్ ఓ ఛానల్ ను కొని ప్రజల్లో పవన్ కళ్యాణ్ పవర్ ని బ్రాండ్ గా క్రియేట్ చేయాలని చూస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ మహా న్యూస్ ఛానల్ ను కొన్నారని గుసగుసలాడుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ ఈ ఛానల్ ని కొన్నారా, లేదా అనే విషయంపై మహాన్యూస్ ఎండీ వంశీ కృష్ణ పక్కా క్లారిటీ ఇచ్చేశారు.

ప్రస్తుతం వస్తున్న ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ.. రామ్ చరణ్ కు తనకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని అన్నారు. మహాన్యూస్ ప్రేక్షకులు ఎవరూ ఈ వార్తల్ని నమ్మొద్దని.. మహాన్యూస్ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు. ఇలా రూమర్స్ క్రియేట్ చేసేవారికి సైతం తమ దగ్గరకు వస్తే నిజానిజాలెంటో వివరిస్తామని మహాన్యూస్ ఎండీ తెలిపారు. దీంతో రామ్ చరణ్ తన బాబాయ్‌ కోసం ఎలాంటి ఛానల్ కొనలేదనే విషయంలో నెటిజన్లకు క్లారిటీ వచ్చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి