Ram Charan : రామ్ చ‌ర‌ణ్ ఆ స‌మయంలో ఏడ్చేశాడా ? ఎందుకు ?

April 20, 2022 11:13 PM

Ram Charan : మెగా అభిమానుల‌తోపాటు ఇత‌ర సినీ ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సినిమా.. ఆచార్య‌. ఈ మూవీ ఈ నెల 29వ తేదీన భారీ ఎత్తున విడుద‌ల‌వుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం కళ్ల‌లో వ‌త్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇక చిత్ర విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర పడుతుండ‌డంతో మేక‌ర్స్ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేశారు. అందులో భాగంగానే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, రామ్ చ‌ర‌ణ్ తేజ తాజాగా ఈ మూవీ విశేషాల‌ను తెలియ‌జేశారు. ఇక ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ వేడుక‌ను కూడా చాలా గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు మేక‌ర్స్ పెద్ద ఎత్తున ఏర్పాట్ల‌ను చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 23వ తేదీన హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున జ‌ర‌గ‌నుంది. స్థానికంగా ఉన్న యూసుఫ్ గూడ పోలీస్ మైదానంలో ఈ ప్రీ రిలీజ్ వేడుక‌ల‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Ram Charan got emotional during Acharya movie filming
Ram Charan

కాగా ఈ సినిమాకు చెందిన అనేక విశేషాల‌ను రామ్ చ‌ర‌ణ్ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు. ఈ మూవీ కోసం తాను తన తండ్రితో క‌లిసి ప‌నిచేయ‌డం ఎంతో సంతోషాన్నిచ్చింద‌ని అన్నారు. ఆ అనుభూతిని మాట‌ల్లో చెప్ప‌లేమ‌న్నారు. ఆచార్య మూవీ వ‌ల్ల త‌న తండ్రితో క‌లిసి న‌టించే అవ‌కాశం ల‌భించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని చ‌ర‌ణ్ అన్నారు.

ఇక ఈ మూవీ చాలా అద్భుతంగా వ‌చ్చింద‌ని.. అందుకు కొరటాల శివ‌కు థ్యాంక్స్ చెబుతున్నాన‌ని.. చ‌ర‌ణ్ అన్నారు. కాగా సినిమాకు వేసిన షూటింగ్ సెట్ నుంచి కాటేజ్‌కు రోజూ వెళ్లి రావాల‌ని చ‌ర‌ణ్ తెలిపారు. కాటేజ్‌లో తాము బ‌స చేసేవార‌మ‌ని.. ఉద‌యాన్నే షూటింగ్‌కు కారులో వెళ్లేవార‌మని.. కారును కూడా తానే డ్రైవ్ చేసేవాడిన‌ని చ‌ర‌ణ్ తెలిపారు. ఒకానొక ద‌శ‌లో త‌న తండ్రితో క‌లిసి ప‌నిచేస్తున్నాన‌న్న అనుభూతి రాగానే త‌న‌కు ఆనంద భాష్పాలు వ‌చ్చేవ‌ని.. ఏం చేయాలో తెలియ‌క ఏడ్చేశాన‌ని.. అలాగే త‌న తండ్రిని కౌగిలించుకునే వాడిన‌ని.. చ‌ర‌ణ్ తెలిపారు. ఇక ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్‌తోపాటు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ముఖ్య అతిథులుగా వస్తార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment