Ram Charan : ఆచార్య ఫెయిల్యూర్‌పై మొద‌టిసారి మాట్లాడిన చ‌ర‌ణ్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

November 13, 2022 3:00 PM

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన తొలి ఫుల్ లెంగ్త్ మూవీ.. ఆచార్య‌. ఈ మూవీ వాస్త‌వానికి ఎప్పుడో రిలీజ్ కావ‌ల్సి ఉంది. కానీ క‌రోనాతోపాటు ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల షూటింగ్ వాయిదా ప‌డింది. దీంతో విడుద‌ల‌ను కూడా వాయిదా వేస్తూ వ‌చ్చారు. అయితే ఎట్ట‌కేల‌కు ఈ మూవీ ఈ ఏడాది వేస‌విలో రిలీజ్ అయింది. కానీ అభిమానుల అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. బాక్సాఫీస్ వ‌ద్ద దారుణ‌మైన డిజాస్ట‌ర్‌గా నిలిచింది. చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా ఆచార్య చెత్త రికార్డుల‌ను న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి గాను భారీగా న‌ష్టాలు కూడా వ‌చ్చాయి. మేక‌ర్స్‌కు ఏకంగా రూ.80 కోట్ల మేర న‌ష్టాలు వ‌చ్చిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఆచార్య మూవీ ఫ్లాప్ కావ‌డంపై ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి మాట్లాడుతూ వచ్చారు. కానీ చ‌ర‌ణ్ మాత్రం దీనిపై నోరు మెద‌ప‌లేదు. తాజాగా ఆయ‌న ఆచార్య మూవీ ఫ్లాప్ పై స్పందించారు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు సినిమా చూసే పద్ధతి మారిపోయిందని క‌చ్చితంగా కంటెంట్ ఉంటేనే వారు ఆద‌రిస్తున్నార‌ని అన్నారు. అలాగే సినిమాలో కంటెంట్ ఉందని వారు నమ్మితేనే సినిమా థియేటర్లకు వస్తున్నారని, ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కూడా తాను ఒక చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సినిమా రిలీజ్ అయిందని అయినా సరే ప్రేక్షకులను ఆ సినిమా థియేటర్లకు రప్పించడంలో విఫలమైందని అన్నారు. ఈ క్ర‌మంలోనే చ‌ర‌ణ్ డైరెక్ట్‌గా చెప్ప‌క‌పోయినా ఇన్‌డైరెక్ట్‌గా ఆచార్య గురించే మాట్లాడిన‌ట్లు అయింది. ఇక వెండితెర‌పై ప్రేక్ష‌కుల్ని నిరాశ‌ప‌రిచిన ఆచార్య బుల్లితెరపై కూడా డిజాస్ట‌ర్‌గా నిలిచింది. చిరంజీవి కెరీర్‌లో అతి త‌క్కువ టీఆర్‌పీ రేటింగ్స్ ఈ మూవీకే వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆచార్య ఫెయిల్యూర్ చిరంజీవిని ఇప్పటికీ వెంటాడుతుంద‌ని.. తాజాగా ఆయ‌న మాట్లాడుతున్న మాట‌ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

Ram Charan finally responded on acharya failure
Ram Charan

ఇక ఆచార్య సినిమా కేవ‌లం 6.30 టీఆర్‌పీ రేటింగ్ మాత్ర‌మే రాబ‌ట్టింది. ఈ క్ర‌మంలోనే రూ.100 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో రూపొంద‌గా ఈ సినిమా కేవ‌లం వ‌ర‌ల్డ్ వైడ్‌గా అతి తక్కువ క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టి డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు కూడా భారీ న‌ష్టాల‌ను మిగిల్చింది. ఈ సినిమా భారీ న‌ష్టాల‌ని చ‌వి చూసిన నేప‌థ్యంలో త‌మ రెమ్యున‌రేష‌న్స్‌ను చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ వ‌దులుకున్నారు. కాగా చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంకర్ డైరెక్ష‌న్‌లో మూవీ చేస్తున్నాడు. అలాగే చిరంజీవి భోళా శంక‌ర్‌, వాల్తేర్ వీర‌య్య చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే రిలీజ్ అయిన చిరు మూవీ గాడ్ ఫాద‌ర్ ఫ‌ర్వాలేద‌నిపించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now