Ram Charan : మెగా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. చ‌ర‌ణ్, శంక‌ర్ సినిమా షూటింగ్ పై అప్‌డేట్‌..

August 26, 2022 8:03 PM

Ram Charan : గ‌త కొంత కాలంగా ద‌ర్శ‌కుడు శంక‌ర్.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ క‌ల‌యికలో రాబోతున్న సినిమా వాయిదా ప‌డింద‌ని సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. శంక‌ర్, క‌మ‌ల్ హాస‌న్ ల భార‌తీయుడు 2 సినిమా కోసం ఈ సినిమాను మ‌ధ్య‌లో ఆపేశార‌ని వ‌దంతులు వ్యాపించాయి. కానీ డెరెక్ట‌ర్ శంక‌ర్ త‌న సోష‌ల్ మీడియా పోస్టు ద్వారా ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త‌నిచ్చారు. దీనితో ఇక‌ రామ్ చ‌ర‌ణ్ తో తాను చేయ‌బోయే సినిమా వాయిదాపై ఉన్న‌ ఊహాగానాల‌కు ముగింపు వచ్చేసిట్టే క‌నిపిస్తోంది.

ఇక శంక‌ర్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో పోస్టు చేస్తూ.. రామ్ చ‌ర‌ణ్ 15వ సినిమా షూటింగ్ సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో తిరిగి ప్రారంభం కానుంద‌ని, త‌రువాతి షెడ్యూల్ హైద‌రాబాద్, వైజాగ్ ల‌లో జ‌రుగుతుంద‌ని చెప్పారు. అలాగే భార‌తీయుడు 2 ఇంకా ఆర్‌సి15 సినిమాలు రెండూ ఏక‌కాలంలో జ‌రుగుతాయ‌ని రాయ‌డం జ‌రిగింది.

Ram Charan and Shankar movie not stopped big update
Ram Charan

దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌డుస్తున్న పుకార్ల‌కు స‌మాధానం దొరికిన‌ట్టుగానే భావిస్తున్నారు. ఇక ఆర్‌సి 15 సినిమాకు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, కియారా అద్వానీ హీరోయిన్, సునీల్ ఇంకా త‌మిళ న‌టుడు జ‌య‌రాం కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. భార‌తీయుడు 2 లో క‌మ‌ల్ హాస‌న్ కు జోడీగా కాజ‌ల్ న‌టిస్తోంది. ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ శంక‌ర్ కెరీర్ లో ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫ‌లితాల‌ను ఇస్తాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment