Rajamouli : తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత దర్శకధీరుడు రాజమౌళికి మాత్రమే సొంతం. ఓ తెలుగు సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఏకైక దర్శకుడు రాజమౌళి. ఆయన రూపొందించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగోడి సత్తా ఎలాంటిదో చాటిచెప్పాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కి , ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ బాగా పెరిగాయి. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా కూడా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ పాటలు, డైలాగులు, సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలు, డైరెక్టర్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన వీడియోలు బాగా హల్ చల్ చేస్తున్నాయి.
మరి ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి గురించి ఆయన అలవాట్లు, ఇతర విషయాల గురించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో రాజమౌళి సతీమణి రమా రాజమౌళిని ఓ ఛానల్ వాళ్లు ఇంటర్వ్యూ చేశారు. అయితే ఆ సమయంలో రాజమౌళి ఇంట్లో ఎలా ఉంటారు? సినిమా ప్రపంచంలోకి వెళితే ఎలా ఉంటారు? అనే ప్రశ్నలు యాంకర్ రమా రాజమౌళిని అడగటం జరిగింది.
ఇంట్లో పిల్లలతో ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు. వారు చెప్పే ప్రతి విషయం చాలా శ్రద్ధగా గ్రహిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది రమ. అతను చాలా టాలెంటెడ్ పర్సన్ అంటూ భర్త గురించి గొప్పగా పొగిడేసింది. అదేవిధంగా డబ్బు పైన ఆయనకు అంతగా ఆసక్తి ఉండదు. డబ్బు విషయం అసలు పట్టించుకోరు. ఎవరైన ఆయన దగ్గర డబ్బు ఉండవచ్చు అన్న ఆలోచనతో అతనితో బయటకు వెళ్తే ఇబ్బంది పడవలసిందే.. ఎందుకంటే అతని జేబులో ఒక్క రూపాయి కూడా ఉంచుకోరు. ఎప్పుడు ఏ సమయంలో ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఆ సమయంలో డబ్బు అవసరం ఉంటే కష్టం కదా.. అందుకే రాజమౌళి కారు డ్రైవర్ దగ్గర కొంత డబ్బు ఉంచమని ఇస్తాను అని చెప్పుకొచ్చింది రమా రాజమౌళి. ప్రస్తుతం రమా రాజమౌళి, రాజమౌళి గురించి చెప్పిన ఈ వీడియోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…