Mahesh Babu : ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నరాజమౌళి ఇప్పుడు మహేష్ సినిమా కోసం సన్నద్ధం అవుతున్నారు. ఈ మూవీపై కూడా అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు కోసం రాజమౌళి ఎలాంటి కథ సిద్ధం చేస్తున్నారు.. ఎంత బడ్జెట్.. ఇలాంటి ఆసక్తికర చర్చ అభిమానుల్లో మొదలైంది. మహేష్, రాజమౌళి తొలి కలయికలో రాబోతున్న చిత్రం ఇది. ఈ చిత్రం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండబోతున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. విజయేంద్ర ప్రసాద్ కూడా తాను ఈ స్టోరీ లైన్ పైనే వర్క్ చేస్తున్నట్లు.. మరికొన్ని ప్రత్యామ్నాయ కథలు కూడా ఉన్నట్లు తెలిపారు.
అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ఇది బిగ్ స్క్రీన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. బలమైన ఎమోషనల్ కోర్‌తో పూర్తిగా ఆకట్టుకునే యాక్షన్ అడ్వెంచర్ అవుతుంది. మహేష్ లార్జర్ ద్యాన్ లైఫ్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వారికి తప్పక అదిరిపోయే ఫీస్ట్ ఇస్తానని అన్నారు రాజమౌళి. మరోవైపు.. మహేష్ బాబు సర్కారు వారి పాట ఒక పాట మినహా షూటింగ్‌ను ముగించారు. తాజాగా మేకర్స్ ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేయడం ద్వారా అదే విషయాన్ని ధృవీకరించారు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పరశురామ్ తెరకెక్కించారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.
రాజమౌళి ప్రాజెక్ట్‌తోపాటు మహేష్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో పూజా హెగ్డెతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఇక రాజమౌళి సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహేష్ సరసన హిందీ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాలో సీత పాత్రలో నటించిన ఆలియా భట్ మరోసారి రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని అంటున్నారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…