Traffic Challan : తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ విభాగం వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లపై రాయితీని అందిస్తున్న విషయం విదితమే. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు ఆ విభాగం మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు రాయితీ ఆఫర్‌ను ప్రకటించిన విషయం విదితమే. అందులో భాగంగానే భిన్న రకాల వాహనాలపై పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను తక్కువ మొత్తం చెల్లించి వాహనదారులు క్లియర్ చేయవచ్చు. అయితే ఈ గడువును ఏప్రిల్ 15వ తేదీ వరకు పొడిగించారు.
ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ఆఫర్‌ను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించిన పోలీసులు మరికొద్ది గంటలే గడువుందని.. కనుక వాహనదారలు తక్కువ మొత్తంలో ట్రాఫిక్ చలాన్లను చెల్లించి చల్లాన్లను క్లియర్ చేసుకోవాలని సూచించారు. వాస్తవానికి మార్చి 31వ తేదీ వరకే ఈ ఆఫర్‌కు గడువు ముగిసినా.. వాహనదారుల నుంచి వచ్చిన స్పందన.. విజ్ఞప్తుల మేరకు ఈ గడువును ఏప్రిల్ 15వ తేదీ వరకు పొడిగించారు. దీంతో మరింత మంది వాహనదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు.
అయితే ఈ గడువును ఇక మళ్లీ పొడిగించబోరని కనుక మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున వాహనదారులు స్పందించాలని.. ట్రాఫిక్ చలాన్లు ఏమైనా పెండింగ్‌లో ఉంటే తక్కువ మొత్తం చెల్లించి బయట పడవచ్చని సంబంధిత శాఖ అధికారులు సూచిస్తున్నారు. కనుక వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…