Traffic Challan : ట్రాఫిక్ చ‌లాన్ల‌ను డిస్కౌంట్‌తో క‌ట్టేందుకు ఇంకొన్ని గంట‌లే గ‌డువు.. త్వ‌ర ప‌డండి..!

April 13, 2022 10:04 PM

Traffic Challan : తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ విభాగం వాహ‌న‌దారుల‌కు ట్రాఫిక్ చ‌లాన్ల‌పై రాయితీని అందిస్తున్న విష‌యం విదిత‌మే. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చ‌లాన్ల‌ను వ‌సూలు చేసేందుకు ఆ విభాగం మార్చి 1 నుంచి 31వ తేదీ వ‌ర‌కు రాయితీ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే భిన్న ర‌కాల వాహ‌నాల‌పై పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చ‌లాన్ల‌ను త‌క్కువ మొత్తం చెల్లించి వాహ‌న‌దారులు క్లియ‌ర్ చేయ‌వ‌చ్చు. అయితే ఈ గ‌డువును ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు పొడిగించారు.

few hours left for pending Traffic Challan
Traffic Challan

ట్రాఫిక్ చ‌లాన్లపై రాయితీ ఆఫర్‌ను ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు పొడిగించిన పోలీసులు మ‌రికొద్ది గంట‌లే గ‌డువుంద‌ని.. క‌నుక వాహ‌న‌దార‌లు త‌క్కువ మొత్తంలో ట్రాఫిక్ చ‌లాన్ల‌ను చెల్లించి చ‌ల్లాన్ల‌ను క్లియర్ చేసుకోవాల‌ని సూచించారు. వాస్త‌వానికి మార్చి 31వ తేదీ వ‌రకే ఈ ఆఫ‌ర్‌కు గ‌డువు ముగిసినా.. వాహ‌న‌దారుల నుంచి వ‌చ్చిన స్పంద‌న‌.. విజ్ఞ‌ప్తుల మేర‌కు ఈ గ‌డువును ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. దీంతో మ‌రింత మంది వాహ‌నదారులు ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకున్నారు.

అయితే ఈ గడువును ఇక మ‌ళ్లీ పొడిగించ‌బోర‌ని క‌నుక మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉన్నందున వాహ‌న‌దారులు స్పందించాల‌ని.. ట్రాఫిక్ చ‌లాన్లు ఏమైనా పెండింగ్‌లో ఉంటే త‌క్కువ మొత్తం చెల్లించి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చని సంబంధిత శాఖ అధికారులు సూచిస్తున్నారు. క‌నుక వాహ‌న‌దారులు ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని కోరుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now