Ram Charan Tej : రామ్ చ‌ర‌ణ్‌ను దూరం ఉంచిన రాజ‌మౌళి.. కానీ చిరంజీవి వ‌ల్ల‌నే..!

October 23, 2021 6:18 PM

Ram Charan Tej : తెలుగు సినిమాల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. దర్శకధీరుడిగా విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న డైరెక్టర్ గా ఫేమస్ అయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్ హీరోలు వెయిట్ చేస్తుంటారు. ఇక ఈయన డైరెక్షన్ లో వచ్చే సినిమా కనీసం రెండేళ్ళైనా పడుతుంది. సినిమా విషయంలో ఎంతో అంకితభావంతో ఉండే వ్యక్తి రాజమౌళి. అందుకే ఈయన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంటాయి.

rajamouli kept Ram Charan Tej away from his first movie

ఈయన డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా హిట్ కొట్టి హీరోలకు స్టార్ డమ్ ను తెచ్చి పెడుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక రాజమౌళి సినిమాలో రామ్ చరణ్ కు ఎలాగైనా అవకాశం వచ్చేలా చేయాలని మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే రాజమౌళి మాత్రం మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ను దూరం పెట్టారు. రామ్ చరణ్ ను రాజమౌళి డైరెక్టర్ గా సినిమాని ఇండస్ట్రీకి పరిచయం చేయలేనని అన్నారట. అయితే ఆ టైమ్ లో రాజమౌళి సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటం వల్లే ఆ మాట అన్నట్లు తెలుస్తోంది.

అలా రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ మొదటి సినిమా మిస్ అయ్యింది. అయితే తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మగధీర సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ తర్వాత రామ్ చరణ్ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంత హిట్ ని అందించిన రాజమౌళి అంటే ప్రత్యేకమైన అభిమానం అని రామ్ చరణ్ ఎన్నో సందర్భాల్లో తెలిపారు.

అందుకే షూటింగ్ సెట్ లో వీరిద్దరూ క్లోజ్ గా ఉండే ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే రామ్ చరణ్ హార్డ్ వర్క్ కూడా తనకు ఎంతో నచ్చుతుందని ఎస్ ఎస్ రాజమౌళి అన్నారు. లేటెస్ట్ గా రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now