Raja Vikramarka : ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న కార్తికేయ ఆ తర్వాత అదే తరహాలో విభిన్నమైన చిత్రాలు చేసినా మంచి విజయాలు రావడం లేదు. దీంతో రాజా విక్రమార్క అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. రీసెంట్‌గా చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇది మూవీపై భారీ అంచనాలు పెంచింది.
కార్తికేయ హీరోగా శ్రీ సారిపల్లి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఎన్‌ఐఏ ఏజెంట్ విక్రమ్‌గా కార్తికేయ కనిపించనున్నారు. తాన్యా రవిచంద్రన్ కథానాయిక. ఈ సినిమా నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌లో కార్తికేయ నటన, లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కార్తికేయని ఉద్దేశించి ‘వీడిది బలుపు కాదు దూల’ అని తనికెళ్ల భరణి ,‘దీపావళి.. గ్రాండ్‌గా ప్లాన్ చేశావ్’ అంటూ కార్తికేయ అలరించారు. రమణా రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.
2.5 మిలియన్ వ్యూస్ ట్రైలర్‌కి దక్కగా ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీనిపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టర్ ను విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా కామెడీలో తన సరికొత్త యాంగిల్ ను చూపించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ అయితే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి మూవీ హిట్ అవుతుందో, లేదో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…