Raja Vikramarka : ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరో కార్తికేయ. తొలి చిత్రంతో అదరగొట్టిన కార్తికేయ ఆ తర్వాత వైవిధ్యమైన ప్రాజెక్టులు చేశాడు. కానీ ఏ చిత్రం కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. చివరిగా చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తన తదుపరి చిత్రాలను ఎంచుకోవడంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం రాజా విక్రమార్క అనే చిత్రం చేస్తుండగా, ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది.
`రాజా విక్రమార్క` చిత్రం ఓ డిఫరెంట్ అండ్ పవర్ ఫుల్ కథాంశంతో రూపొందింది. దీపావళి కానుకగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా, కామెడీ, డ్రామా, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కచ్చితంగా కార్తికేయ హిట్ కొట్టబోతున్నాడనే సంకేతాన్నిస్తుంది. నాని చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కాగా, ట్రైలర్ చూస్తే కార్తికేయ భద్రతా దశాల అధికారిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది.
హోం మంత్రికి ముప్పు అంటే బాధ్యత నాది.. ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి.. అంటూ సుధాకర్ కోమాకుల చెప్తున్న డైలాగ్స్ ఆసక్తిని కలిగించగా.. తనికెళ్ల భరణి.. కార్తికేయ మధ్య జరిగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…