Samantha : చైతూ నుండి విడిపోయిన తర్వాత సినిమాల స్పీడ్ పెంచిన సమంత ఇప్పటికే రెండు సినిమాలకు ఓకే చెప్పింది. ఇప్పుడు మూడో సినిమా కూడా ఒప్పుకున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. నేచురల్ స్టార్ నానితో ఆమె జోడీ కట్టనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ వచ్చింది.
నేచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల ‘దసరా’ అనే మూవీ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా ఎంపిక కాగా, సెకండ్ హీరోయిన్‌గా సమంత కనిపించే అవకాశాలు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో ఆమె సన్నిహిత వర్గాలు పుకార్లని కొట్టి పారేశాయి. సమంత సెకండ్ హీరోయిన్‌గా నటించదు అని అన్నారు.
చైతూతో విడాకుల తాలూకు చేదు జ్ఞాపకాన్ని వీలైనంత త్వరగా మరిచిపోవడానికి సమంత తెగ ప్రయత్నాలు చేస్తోందట. అందుకోసమే సరదాగా తన స్నేహితులతో టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తోందని అంటున్నారు. ఇదిలా ఉంటే తన కేరీర్ విషయంలోనూ కొత్త అడుగులేస్తున్న సామ్.. తనకు నచ్చే కథలు వస్తే ఎలాంటి పాత్ర అయినా ఓకే అంటోంది.
సమంత.. ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి.. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంలో రాబోతున్న ఓ చిత్రానికి, అలాగే తెలుగులో శ్రీదేవి మూవీస్ వారి చిత్రానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. త్వరలో ఓ బాలీవుడ్ మూవీ కూడా చేయనుందని టాక్. మరోవైపు నాని దసరా తెలంగాణలోని కొత్త గూడెంలో షూటింగ్ జరుపుకోనుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…