Bigg Boss 5 : చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 58 రోజులు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 5న ప్రారంభమైన ఈ షోలో 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక సోమవారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఏకంగా పది మంది నామినేట్ అయ్యారు. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు ఇంటి సభ్యులకు ఫోమ్ పూసి తగు కారణాలు చెప్పి నామినేట్ చేయాలని ఆదేశించాడు బిగ్‌బాస్.
షణ్ముఖ్ కెప్టెన్ కావడంతో అతనిని ఎవరూ నామినేట్ చేయోద్దని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో మానస్ ముందుగా శ్రీరామ్, జెస్సీలను నామినేట్ చేశాడు. సిరి.. సన్నీ, ఆనీ మాస్టర్‌లను నామినేట్ చేసింది. శ్రీరామ్.. సన్నీ, మానస్‌లను నామినేట్ చేశాడు. రవి.. మానస్, కాజల్‌లను నామినేట్ చేశాడు. జెస్సీ.. సన్నీ, మానస్‌లను నామినేట్ చేశాడు. ప్రియాంక.. విశ్వ, రవిలను నామినేట్ చేసింది. సన్నీ.. సిరి, జెస్సీలను నామినేట్ చేశాడు.
విశ్వ.. ప్రియాంక, మానస్‌లను నామినేట్ చేశాడు. కాజల్.. రవి, శ్రీరామ చంద్రలను నామినేట్ చేసింది. అనీ మాస్టర్.. సిరి, కాజల్‌లను నామినేట్ చేసింది. షణ్ముఖ్.. మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ఇలా 9వ వారం నామినేషన్స్‌లో భాగంగా.. మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, ఆనీ మాస్టర్, విశ్వ ఈ పది మంది నామినేట్ అయ్యారు.
షణ్ముఖ్ కెప్టెన్ కావడంతో సేఫ్. అలాగే అనీ మాస్టర్‌కి దక్కిన పవర్ కారణంగా ఆమె కూడా సేఫ్ జోన్‌లోనే ఉంది. మిగతా వారు డేంజర్ జోన్‌లో ఉండగా, వారికి నామినేషన్స్ నుంచి సేవ్ కావడానికి ఇమ్యునిటీ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్‌లో నామినేషన్స్‌లో ఉన్న 10 మంది పోటీ పడుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…