Radhe Shyam : రాధేశ్యామ్ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందా ? నిజ‌మెంత ?

January 26, 2022 2:06 PM

Radhe Shyam : క‌రోనా నేప‌థ్యంలో అనేక సినిమాలు వాయిదా ప‌డుతున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే సంక్రాంతికి విడుదల కావ‌ల్సిన ప్ర‌భాస్ రాధే శ్యామ్ మూవీని వాయిదా వేశారు. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సినిమా ఉండ‌డం, క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల జ‌న‌వ‌రి 14న విడుద‌ల కావ‌ల్సిన మూవీని వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Radhe Shyam releasing on OTT what is the truth

అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలోనే డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తారంటూ గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. దీంతో అప్ప‌ట్లో చిత్ర నిర్మాత‌లు ఈ విష‌యంపై స్పందించారు. రాధే శ్యామ్‌ను థియేట‌ర్లలోనే రిలీజ్ చేస్తామ‌ని చెప్పారు. దీంతో పుకార్ల‌కు చెక్ పెట్టిన‌ట్లు అయింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఇవే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఓ బ‌డా స్ట్రీమింగ్ సంస్థ రాధే శ్యామ్‌ను కొనుగోలు చేసేందుకు భారీ డీల్‌ను ఆఫ‌ర్ చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

కానీ తాజాగా వ‌స్తున్న వార్త‌ల‌ను చిత్ర యూనిట్ ఖండించ‌లేదు. అయితే రాధేశ్యామ్ లాంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను ఓటీటీలో విడుద‌ల చేస్తే నిర్మాత‌ల‌కు తీవ్ర‌మైన న‌ష్టం క‌లుగుతుంది. క‌నుక ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసే చాన్సే లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

సాధార‌ణంగా ఓటీటీ యాప్స్ రూ.120 కోట్లు అంత‌క‌న్నా త‌క్కువ మొత్తంలో బ‌డ్జెట్ పెట్టిన సినిమాల‌ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఓటీటీ యాప్స్ ఒక మూవీకి గ‌రిష్టంగా రూ.150 కోట్ల‌ను ఖర్చు చేయ‌గ‌ల‌వ‌ని.. కానీ రాధే శ్యామ్ చిత్రాన్ని రూ.300 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో తీశారు క‌నుక‌.. త‌క్కువ మొత్తానికి చిత్రాన్ని ఎవ‌రూ అమ్ముకోర‌ని అంటున్నారు. క‌నుక రాధే శ్యామ్ ఓటీటీలో విడుద‌ల కాద‌ని, థియేట‌ర్ల‌లోనే విడుద‌ల‌వుతుంద‌ని అంటున్నారు. దీనిపై చిత్ర నిర్మాత‌లు మ‌ళ్లీ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేస్తార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now